Wednesday 2 March 2016

శంకరస్తోత్రాలు : ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రమ్



 ॥ श्री शंकराचार्य कृतं द्वादशज्योतिर्लिङ्गस्तोत्रम् ॥


॥ శ్రీ శంకరాచార్య కృతం ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రమ్ ॥

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్రకలావతంసమ్ ।
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥

భూమిపై  సౌరాష్ట్ర దేశమునందు జనుల భక్తిని పెంపొందించుటకై అవతరించినవాడు , జ్యోతిర్మయుడు , చంద్రకళాధరుడు అగు సోమనాథుని శరణు పొందుచున్నాను.


శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2 ॥

అనేక కథలకు ఆధారమైన శ్రీశైలమునందు , శేషాద్రి శిఖరమునందు నివసించువాడు , సంసార సముద్రమును దాటించు వంతెన వంటివాడు అగు మల్లికార్జునుని నమస్కరించుచున్నాను.


అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వన్దే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥

సజ్జనులకు మోక్షమునిచ్చుటకై ఉజ్జయినీపట్టణమునందు అవతరించిన దేవనాయకుడగు మహాకాలుని , అకాల మృత్యువునుండి రక్షించుటకై నమస్కరించుచున్నాను.


కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ ।
సదైవమాన్ధాతృపురే వసన్తమోఙ్కారమీశం శివమేకమీడే ॥ 4 ॥

సజ్జనులను తరింపచేయుటకై కావేరీ - నర్మదా నదుల సంగమస్థానమైన మాంధాతృపురమందు నివసించు ఓంకారేశ్వరుడను శివుని స్తుతించుచున్నాను.


పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసన్తం గిరిజాసమేతమ్ ।
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5 ॥

ఈశాన్య దిక్కునందు ’ పరలి’ అను క్షేత్రములో పార్వతీసమేతుడై దేవతలచే  - రాక్షసులచే ఆరాధింపబడు వైద్యనాథుడను శివుని ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


యామ్యే సదఙ్గే నగరేఽతిరమ్యే విభూషితాఙ్గం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 6 ॥

సుందరమైన ’ ఆమర్ద ’ నగరమునందు పాముల పడగలచే అలంకరింపబడు శరీరము కలవాడై భుక్తి - ముక్తులను ఇచ్చు  శ్రీనాగనాథుడను ఈశ్వరుని శరణు పొందుచున్నాను.


మహాద్రిపార్శ్వే చ తటే రమన్తం సమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 7 ॥

ఆనందవనములో సంతోషముగా నివసించు ఆనందమయుడు , పాపసమూహములను నాశనం చేయువాడు , కాశీపట్టణమునకు నాథుడు , అనాథరక్షకుడు అగు విశ్వనాథుని శరణుపొందుచున్నాను.


సహ్యాద్రిశీర్షే విమలే వసన్తం గోదావరితీరపవిత్రదేశే ।
యద్ధర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే ॥ 8 ॥

డాకినీ - శాకినుల సమాజమునందుండి రాక్షసులచే కూడ సేవించబడుచూ భక్తులకు హితమొనరించు భీమేశ్వరుని ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


సుతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసఙ్ఖ్యైః ।
శ్రీరామచన్ద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 9 ॥

తామ్రపర్ణీ సాగర సంగమ స్థలమునందు సేతువు నిర్మించిన పిదప శ్రీరామచంద్రునిచే రాత్రి సమయమున మారేడు దళములతో పూజింపబడిన రామేశ్వరుని ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్దం తం శఙ్కరం భక్తహితం నమామి ॥ 10 ॥

సింహాద్రి సమీపములో గోదావరీ తీర పవిత్ర ప్రదేశమునందు వెలసి దర్శించినంతనే పాపములను పోగొట్టు త్ర్యంబకేశ్వరుని స్తుతించుచున్నాను.


సానన్దమానన్దవనే వసన్తమానన్దకన్దం హతపాపవృన్దమ్ ।
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 11 ॥

హిమాలయ ప్రాంతమునందు విహరించుచూ మునీంద్రులచేత , దేవతలచేత , రాక్షసులచేత , యక్షులచేత , మహాసర్పములచేత పూజింపబడు కేదారేశ్వరుడను శివుని స్తుతించుచున్నాను.


ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసన్తం చ జగద్వరేణ్యమ్ ।
వన్దే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణమ్ ప్రపద్యే ॥ 12 ॥

ఏలాపురిలోని రమ్యశివాలయమునందు విలసిల్లుచున్నవాడు , మూడు లోకములచే కోరబడువాడు , గొప్ప ఉదార స్వభావం కలవాడు , ధిషణేశ్వరుడని పిలువబడు శివుని నమస్కరించుచున్నాను.


జ్యోతిర్మయద్వాదశలిఙ్గకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥ 13 ॥

పరిశుద్ధమనస్కులై ప్రాతఃకాలమునందు ఈ ద్వాదశలింగస్తోత్రమును పఠించు మానవులు పుత్ర - పౌత్ర - ధన - కీర్తులు పొంది సుఖించెదరు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం ద్వాదశజ్యోతిర్లిఙ్గస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.