కన్నడ
గౌళ – రూపక
పల్లవి:
సొగసుఁ
జూడఁదరమా నీ సొ..
అను
పల్లవి:
నిగనిగమనుచుఁ
గపోలయుగముచే మెఱయు మోము సొ..
చరణము(లు):
అమరార్చిత
పదయుగమో
అభయప్రద
కరయుగమో
కమనీయ
తనునిందిత కామ
కామరిపునుత
నీ సొ..
వరబింబ
సమాధరమో
వకుళ
సుమంబుల యురమో
కర
ధృతశర కోదండ
మరకతాంగవరమైన
సొ..
చిఱునవ్వో
ముంగురులో
మఱి
కన్నులతేటో
వర
త్యాగరాజార్చిత
వందనీయ
ఇటువంటి సొ..