Tuesday, 22 March 2016

శ్రీరామకర్ణామృతము : వామాంకస్థితజానకీ (భద్రాద్రి రాముడు)




వామాంకస్థితజానకీపరిలసత్కోదండదండం కరే
చక్రం చోర్ధ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే |
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం
కేయూరాదివిభూషితం రఘుపతిం రామం భజే శ్యామలమ్ ||

(శ్ర్రీరామ కర్ణామృతం 1:27)

ఎడమతొడయందున్న సీత సేవింప, శోభించుచున్న ధనువునొకచేతను, పైచేత చక్రమును, కుడిచేతులు రెంటియందు శంఖమును బాణమును ధరించుచున్నట్టియు, పద్మపురేకులవంటి నేత్రములు గలిగినట్టియు, భద్రాచలశిఖరమందున్నట్టియు, భుజకీర్తులు మొదలగు వానిచే నలంకరింపబడినట్టియు, నల్లనైన రఘురాజశ్రేష్ఠుడైనట్టి రాముని సేవించుచున్నాను .

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.