అఖిలాణ్డేశ్వరి రక్షమామ్
జుజావన్తి / ఆదిపల్లవి:
అఖిలాణ్డేశ్వరి రక్షమామ్
ఆగమ సమ్ప్రదాయ నిపుణే శ్రీ
అనుపల్లవి:
నిఖిల లోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామళే సకల కలే
చరణము:
లమ్బోదర గురుగుహ పూజితే
లమ్బాలకోద్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వరశైలరాజనుతే శారదే
మధ్యమకాలసాహిత్యం:
జమ్భారి సమ్భావితే జనార్దననుతే
జుజావన్తి రాగనుతే జల్లీ మద్దళ
ఝర్ఝర వాద్య నాదముదితే ఙ్ఞానప్రదే