1 ప్రశ్న: సౌందర్యలహరిని ప్రతిరోజూ 1008 సార్లు చదవవలసి ఉందా? లేక చదవగలిగినన్ని సార్లు మాత్రం చదివితే పరవాలేదా?
జవాబు: ప్రతిదినమూ ఎన్నిసార్లు చదువగలిగితే అన్నిసార్లు చదవవచ్చును.
2 ప్రశ్న: నా వంటి విద్యార్ధినులు సౌందర్యలహరి చదవవచ్చునా?
జవాబు: సౌందర్యలహరి స్త్రీలు , పురుషులు , పిల్లలు అందరూ చదవవచ్చును.
3 ప్రశ్న: వివాహం కాని ఆడపిల్లలు శ్రీ ఆంజనేయస్వామిని తాకి అర్చించవచ్చునా?
జవాబు: ఏ దేవతా మూర్తినీ తాకి అర్చించకూడదు.
4 ప్రశ్న: పురుషులు దీపం వెలిగించటం , ఆర్పటం చేయవచ్చునా?
జవాబు: పురుషులు దీపం వెలిగించవచ్చును , ఆర్పవచ్చును తప్పులేదు.
5 ప్రశ్న: మా కుటుంబంలో కొంత కాలంగా భార్యా భర్తల మధ్య కలహాలతో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటోది. నేను ఏ స్తోత్రం పఠిస్తే పరిస్థితి చక్కబడి భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది?
జవాబు: సౌందర్యలహరిలో 35వ శ్లోకము పారాయణ చేయవలసి వుంది.
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ ।
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానన్దాకారం శివయువతి భావేన బిభృషే ॥ 35 ॥