కల్యాణి
- ఝంప
పల్లవి:
అమ్మ!
రావమ్మ తులసమ్మ నను పాలింప
వమ్మ!
సతతము పదములే నమ్మి నానమ్మ ॥అమ్మ॥
అను
పల్లవి:
నెమ్మదిని
నీ విహ పరమ్ము లొసగుదు వనుచు
కమ్మవిల్తుని
తండ్రి గలనైన బాయడట ॥అమ్మ॥
చరణము(లు):
నీ
మృదు తనువును గని - నీ పరిమళమును గని
నీ
మహత్వమును గని - నీరజాక్షి
తామరస
దళనేత్రు - త్యాగరాజునిమిత్రు
ప్రేమతో
శిరమునను - బెట్టుకొన్నాడట ॥అమ్మ॥