Sunday, 6 March 2016

శివస్తుతులు : లింగోద్భవ వేళలో బ్రహ్మ, ఋషుల స్తుతి (స్కాందపురాణం)



శివస్తుతులు : లింగోద్భవ వేళలో బ్రహ్మ, ఋషుల స్తుతి
(స్కాందపురాణం)


(బ్రహ్మ స్తుతి)

త్వం లింగరూపీ తు మహాప్రభావో వేదాంతవేద్యోసి మహాత్మరూపీ| యేనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యమ్‌ ||
త్వం సాక్షీ సర్వలోకానాం హర్తా త్వం చ విచక్షణ:| రక్షణోసి మహాదేవ భైరవోసి జగత్పతే ||
త్వయా లింగస్వరూపేణ వ్యాప్తమేతజ్జగత్త్రయమ్‌ | క్షుద్రాశ్చైవ వయం నాథ మాయామోహితచేతస: ||
అహం సురాసురా : సర్వే యక్షగంధర్వరాక్షసా: | పన్నగాశ్చ పిశాచాశ్చ తథా విద్యాధరా హ్యమీ ||
త్వం హి విశ్వసృజాం స్రష్టా త్వం హి దేవో జగత్పతి:| కర్తా త్వం భువనస్యాస్య త్వం హర్తా పురుష: పర: ||
త్రాహ్యస్మాకం మహాదేవ దేవదేవ నమోస్తు తే| ఏవం స్తుతో హివై ధాత్రా లింగరూపీ మహేశ్వర: ||


గొప్ప కాంతిగల నీవులింగరూపముగలవాడవు వేదాంతముచేత తెలియదగినవాడవు. సదా ఆనందరూపుడైన (సత్‌, ఆనందరూపుడైన) నీ చేతనే ఈ జగత్తు ఆత్మమూలముగా నిత్యము చేయబడినది. నీవే అన్ని లోకములకు సాక్షివి. మేధావియైన నీవే హరించువాడవు మహదేవా, జగత్పతీ నీవే రక్షకుడవు, బైరవుడవు లింగస్వరూపియైన నీచేత ఈ మూడులోకములు వ్యాపించినవి మేము అల్పులము, మాయచే మోహించుబుద్దిగలవారము. నేను, సురులు, అసురులు, యక్ష, గంధర్వ, రాక్షసులు, సర్పములు, పిశాచాలు, విద్యాధరులందరూ (ఇట్టివారమే) నీవు విశ్వమును సృజించువారినే సృజించెదవు నీవే హరించు పరమపురుషుడవు.  మహాదేవా దేవ దేవా! మమ్ముల రక్షింపుము దేవా నీకు నమస్కారము,ఇట్లు బ్రహ్మచేత లింగరూపియగు శివుడు స్తుతింపబడెను

(ఋషుల స్తుతి)
అజ్ఞానినో వయం కామాన్న విందామోస్య సంస్థితిమ్‌ | త్వం హ్యాత్మా పరమాత్మా చ ప్రకృతిస్త్వం విభావినీ ||
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ| త్వమీశ్వరో వేదవిదేకరూపో మహానుభావై: పరిచింత్యమాన: ||
త్వమాత్మా సర్వభూతానామేకోజ్యోతిరివైధసామ్‌| సర్వం భవతి యస్మాత్వత్తస్తస్మాత్సర్వోసి నిత్యదా ||
యస్మాచ్చ సంభవత్యేతత్తస్మాచ్ఛంభురితి ప్రభు: ||
త్వత్పాదపంకజం ప్రాప్తా వయం సర్వే సురాదయ: ఋషయో దేవగంధర్వా విద్యాధరమహోరగా: ||
తస్మాచ్చ కృపయా శంభో పాహ్యస్మాన్జగత: పతే ||


అజ్ఞానులమైన మేము లింగముయొక్క నిజమైన స్థితిని కోరికచేత తెలుసుకొనలేకున్నాము. నీవే తల్లివి, తండ్రివి, నీవే బంధువు.సఖుడవు నీవే. నీవీశ్వరుడవు, వేదము తెలిసినవాడవు, ఒకే రూపము గలవాడు మహానుభావులచే ధ్యానింపబడువాడవు.  వేరు వేరు కట్టెలలో నొక్కటిగా నుండు జ్యోతి వలె ఒక్కడివి నీవు అన్ని భూతముల ఆత్మవు నీ నుండే అంతా కలుగుచున్నందున నీవు నిత్యము సర్వుడని (పిలబడబడుచున్నావు)  ఇదంతా (నీనుండే) ఏర్పడుచున్నందున శంభుడవు నీవే. దేవతలు మొదలుగా మేమంతా నీ పాదకములమును చేరితిమి, ఋషులు, దేవతలు, గంధర్వులు, విద్యాదరులు,గొప్ప సర్పములు (మేమంతా నిన్ను చేరితిమి) జగత్తుయొక్క పాలకుడా! కనుక మమ్ములనుకరుణచే రక్షింపుము.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.