Tuesday, 15 March 2016

శ్యామశాస్త్రి కృతి : దేవీ బ్రోవ సమయమిదే





దేవీ బ్రోవ సమయమిదే

చిన్తామణి / ఆది

దేవీ బ్రోవ సమయమిదే 
అతి వేగమే వచ్చినా వెతలు దీర్చి కరుణిఞ్చవే 
శఙ్కరి కామాక్షి   
|| దేవీ బ్రోవ ||

లోకజననీ నాపై దయలేదా నీ దాసుడు గాదా
శ్రీ కాఞ్చి విహారిణీ కల్యాణీ ఏకామ్రేశ్వరుని
 ప్రియభామయైయున్న నీకేమమ్మా 
ఎంతో భారమా వినుమా నా తల్లి
|| దేవీ బ్రోవ ||


రేపు మాపని చెప్పితే నే వినను దేవి 
ఇక తాళను నేను ఈ ప్రొద్దు దయచేయవే 
కృపజూడవే నీ పదాబ్జములే మదిలో సదా యెఞ్చి 
నీప్రాపు కోరియున్నానమ్మా ముదముతో మా తల్లి
|| దేవీ బ్రోవ ||

శ్యామకృష్ణుని సోదరి కౌమారి బిమ్బాధరి గౌరి
హేమచలజే లలితే పరదేవతే కామాక్షి నినువినా
భూమిలో ప్రేమతో కాపాడేవరెవరున్నారమ్మా నా తల్లి
|| దేవీ బ్రోవ ||

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.