శ్రీరామమ్
నారాయణగౌళ / ఆదిపల్లవి:
శ్రీరామమ్ రవికులాబ్ది సోమమ్ శ్రితకల్ప భూరుహమ్ భజేహమ్
అనుపల్లవి:
ధీరాగ్రగణ్యమ్ వరేణ్యమ్ దీన జనాధారమ్ రఘువీరమ్
నారదాది సన్నుత రామాయణ పారాయణ ముదిత నారాయణమ్
చరణము:
దశరథాత్మజమ్ లక్ష్మణాగ్రజమ్ దానవ కుల భీకరమ్ శ్రీకరమ్
కుశలవతాతమ్ సీతోపేతమ్ కువలయనయనమ్ సుదర్భశయనమ్
మధ్యమకాలసాహిత్యం:
సుశరచాప పాణిమ్ సుధీమణిమ్ సూనృత భాషమ్ గురుగుహతోషమ్
దశవదన భఞ్జనమ్ నిరఞ్జనమ్ దాననిధిమ్ దయారస జలనిధిమ్