Saturday 6 May 2017

రామాయణప్రభ : సీతమ్మకు మహాసాధ్వి అనసూయ ఉపదేశం



రామాయణప్రభ : సీతమ్మకు మహాసాధ్వి అనసూయ ఉపదేశం
(అయోధ్యకాండాతర్గతం)

అమ్మా! భర్త నగరమునందున్నను ఉండనిమ్ము. అడవిలోనైనను ఉండనిమ్ము. మంచివాడే కానిమ్ము, పాపాత్ముడేకానిమ్ము, భర్తని ప్రేమతో ఆదరించెడి స్త్రీ ఉత్తమలోకములను పొందును.చెడునడవడి కలవాడైనను, స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడైనను, ధనహీనుడైనను, ధర్మబద్ధమగు స్వభావము కల స్త్రీలకు భర్తయే పరదైవము. ఆలోచించి చూడగా భర్తకంటే గొప్ప బంధువు లేడని నేను భావించుచుందును. భర్తను ప్రేమించి ఆరాధించుటకంటే యోగ్యమగు తపస్సు వేరొకటి లేదు. సత్ప్రవర్తన లేని స్త్రీలు మంచి చెడులను గుర్తించలేరు. వారి కోరికలు తీర్చుకొనుటయే వారికి ప్రధానము. భర్తలను నియమించెడి వారలైయుందురు. పురుషులను కాంక్షించుచుందురు. అట్టివారు అపకీర్తిని పొందుదురు. ధర్మమునుండి దిగజారుదురు. చేయకూడని పనులను చేయుటకు అలవాటు పడిన అట్టి స్త్రీలు వినాశమునందుదురు. గుణవంతులైన స్త్రీలు ధర్మాచరణము చేసిన వారలై స్వర్గము నందు విహరింతురు. కావున నీవు భర్తకు సహధర్మచారిణివై అనుసరించి ఉండి కీర్తిని పొందుము. ధర్మమును ఆర్జించుకొనుము. పతివ్రతలు ఆచరించెడి మార్గమును అనుసరించి ఉత్తమ పతివ్రతవై ఉండుము. భర్త చేసెడి ధర్మములలో తోడు నీడగ ఉండి కీర్తిని , ధర్మమును పొందుము.

రామాయణప్రభ : రామాయణంలో శరణాగతి


రామాయణప్రభ : రామాయణంలో శరణాగతి
శ్రీ శ్రీనివాసాచార్యులుగారు

రామాయణం శరణాగతి ప్రధానమైన కావ్యం. అడుగడుగునా మనకు భగవంతునికొరకు చేసే శరణాగతి కనపడుతుంది. అసలు శరణాగతి అంటే ఏమిటో, తత్ఫలితాలు ఏమో, రామాయణంలో శరణాగతి సందర్భాల ఆధారంగా శ్రీ శ్రీనివాసాచార్యులుగారు వివరించారు.


Friday 5 May 2017

రామాయణప్రభ : రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి


రామాయణప్రభ : రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి

శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణచేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతోసహా వివిధభాష్యాలను ఆపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా అంతరార్థములతో సహా పామరులకు సైతం సులువుగా అర్థమయ్యేటట్లు వివరిస్తారు, కానీ ప్రచారమునకు బహుదూరంగా ఉంటూ సాధారణజీవనం గడుపుతారు.

మా అదృష్టం చేత, వారు కొన్ని రామాయణ విశేషణములను వివరించి, ఆ వివరణను వీడియో తీయుటకు అనుమతించారు.

ఈ వీడియోలో, రామాయణం లోని శ్లోకాల, సర్గల పారాయణయొక్క ఫలితములను వివరించారు.

 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.