Saturday 23 April 2016

పరమాచార్యుల అమృతవాణి : చిత్తశుద్ధికి సాధనాలు



పరమాచార్యుల అమృతవాణి : చిత్తశుద్ధికి సాధనాలు

ధ్యానం చేయవలెనని మనం కూచుంటాం, కానీ ఏకాగ్రత సులభంగా రాదు. దీనికి కారణమేమి? మనశ్చాంచల్యమే. మనస్సు లెక్కలేనన్ని విషయాలను గూర్చి ఆలోచిస్తూ వుంటుంది. అన్ని కష్టాలకు కారణము మనస్సే. ''మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః'' మనకున్న లెక్కలేని కోరికలు మనస్సుకు స్థిరతను ఇవ్వడంలేదు. ఆశలను అన్నిటినీ వదలిపెట్టు అని మనస్సుకు మనం దృఢంగా చెప్పలేకున్నాం.

ఒక ప్రత్యేకమైన విషయం గూర్చి ధ్యానించు అని మనం మనస్సుకు చెబితే అది కొన్ని క్షణాలు దానిని గూర్చి ధ్యానించి వెంటనే వేరు విషయాలపై వ్యగ్రమౌతుంది. ధ్యానాన్ని గూర్చి, శాంతిని గూర్చి నేను ఉపన్యాసం చేస్తున్నపుడు కొన్ని క్షణాలు మీ మనస్సు ధ్యానలగ్నమై శాంతిని చవిచూచినా వెంటనే మళ్ళా తన పాత వాసనల ప్రకారం ఇతర విషయాలపైకి వెళ్ళిపోతుంది. ఆ క్షణంసేపు మీరు అనుభవించిన ఆనందం అట్లే అందకుండా జారిపోతుంది.

మనం చెప్పినట్లు మనస్సు వింటేనే, మనకు మనస్సు స్వాధీనమైనదని చెప్పగలం. పిచ్చివారికి చిత్త స్వాధీనంలేదని అంటాం. కానీ మనంకూడ ఒక విధంగా పిచ్చివాళ్ళమే. వాళ్ళకెంత అస్వాధీనమో, మనచిత్తాలూ అంత అవశములుగానే వున్నాయి. చిత్తస్వాధీనమున్న వారు ఎట్టి కష్టం వచ్చినా, ఎట్టి భయానక సందర్భము ఏర్పడినా, ఎంత దుఃఖం సంభవించినా, మనస్సులో అలజడి లేక శాంతంగా ఉండగలరు. వారిని కామక్రోధాలు కలవరపెట్టవు. ఏ స్థితిలోనూ వారు కోపావేశానికి గురికాకుండా, అనుద్విగ్నులై నిర్లిప్తులుగా వుంటారు. మనస్సు తైలధారవలె, అఖండంగా ఒక స్థాయీ భావానికి వచ్చినపుడే మనస్సు ధ్యానమగ్నమైనదని చెప్పగలం.

ఇట్లు చిత్తవృత్తులు నిరోధించి మనస్సును ఏకాగ్రతం చేయడాన్నే యోగమని అంటారు. జీవితంలో కామక్రోధాలు సంభవించే సన్నివేశాలు ఎన్నో వుంటాయి. వీనినుంచి తప్పించుకోడానికి యోగం అవసరం. ఆ యోగం ఎప్పుడో చేస్తామని అనుకోకూడదు. ఆ యోగభ్యాసం ఈ జన్మలోనే జరగాలి. అట్లా యోగాభ్యాస తత్పరుడై, మనస్సును స్వాధీనం చేసుకొన్నవానిని గీత యుక్తుడని అంటుంది.

యోగాభ్యాసం ఎవరో ఋషులూ, యోగులూ చేయవలసిన కార్యమేకాని మనబోటి వారికి కాదు అన్న భావానికి మనం ఎన్నడూ చోటు ఇవ్వరాదు. వ్యాధిగ్రస్తునికే కదా ఔషధం యొక్క అవసరం. చిత్త చాంచల్యంతో, యెడతెగని కోరికలతో బాధపడుతున్న మనకే కదా యోగం ఉపయుక్తంగా వుంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ తమకున్న కాలంలో కొంతసేపయినా చిత్తవృత్తి నిరోధకమైన యోగాన్ని అభ్యసించడానికి పూనుకోవాలి.

మనో నిరోధానికి రెండు సాధనలున్నవి. ఒకటి అంతరంగం. రెండవది బహిరంగం. ఈ రెండూ అవసరమే. యజ్ఞయాగాదులు, సంధ్యోపాసన, దేవతార్చన, పరోపకారము, దానధర్మములు చేయుట, బహిరంగసాధనలు. అహింస, సత్యము, ఆస్తేయము, శౌచము, ఇంద్రియనిగ్రహము అంతరంగసాధనలకు ఉపాంగములు.

ఏ వ్యక్తిగానీ, ఏ జీవికిగానీ కీడుచేయక భూతదయతో మనస్సు ప్రేమ ప్రపూర్ణంగా చేసుకోవటమే అహింస. మనోవాక్కాయ కర్మలతో యదార్ధచింతన, కధన, ఆచరణలే సత్యము. అస్తేయమనగా దొంగతనం చేయకుండుట. పరద్రవ్యాపహరణ చేయకుండా వైరాగ్య నిరతితో ఉండుట. ఆహారశుద్ధి, దేహశుద్ధి, మలాపకర్షక స్నానాదులు శౌచము. ఇంద్రియాలను ఇచ్చ వచ్చిన రీతి మెలగనీయక నియమ వ్యాపార బద్ధములుగా చేయుట ఇంద్రియ నిగ్రహం. ఈ ఐదున్నూ సామాన్య ధర్మములు. వీని ననుష్టించవలెనని మనుధర్మశాస్త్రం చెబుతుంది.

1. అహింస

మనోజయమే యోగం. అహింస దానికొక అంగం. ధర్మశాస్త్రాలలో అది సామాన్య ధర్మంగా చెప్పబడింది. యోగశాస్త్రంలో అదొక అంగం. అహింస ముఖ్యోద్దేశం చిత్తవృత్తి నిరోధం. ఇది ముఖ్య ప్రయోజనం. దీనితోబాటు దీనికొక అవాంతర ప్రయోజనంకూడా వుంది. అది వైరత్యాగం. యోగ సూత్రాలు 'అహిస ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైర త్యాగః' అని చెబుతున్నవి. అహింస సాధించిన వారి సమక్షంలో పరస్పరం వైరమున్నవారు సఖ్యభావాన్ని భజిస్తారట. అహింసావ్రతం పాటించే మహాత్ముని ముందు ఘాతకులు చెష్టతక్కి నిల్చిపోతారు. సన్యాసులు అహింసను పాటించాలి. అది వారి ప్రతిజ్ఞ. వారి వలన ఏ ప్రాణికీ భయముండరాదు. వేదోక్త కర్మలను తప్పించి ఇతర కర్మలలో హింస ఉండరాదు. అందుకే సన్యాసి వంట చేయరాదు. ఆకు గిల్లరాదు.

2. సత్యం

అహింస తర్వాత సామాన్య ధర్మం సత్యం. ''వాఙ్మనసయోరైక రూపం సత్యం''. - అని సత్య లక్షణం. మనస్సులో ఉన్నది ఉన్నట్లు చెప్పుటే వాక్ప్రయోజనం. మనం ఊరి వారి తప్పులన్నీ ఉగ్గడిస్తూ వుంటాం. మనం చెప్పేది నిజం కావచ్చు. వాఙ్మనస్సులకు ఏకత్వమూ ఉండవచ్చు. కాని అవి సత్యభాషణలుకావు. 'సత్యం భూతహితం ప్రియం' అన్నారు. మనం చెప్పేదానిలో భూతహితమూ, ప్రియమూ వున్నదా అని చూడాలి. సత్యం సర్వ జీవక్షేమకరంగా వుండాలి. కామక్రోధవశంగా వాగ్రూపంగా బయటకు వచ్చేది సత్యమనిపించుకోదు. సత్యం ఇతరులకు తాపకారణంగా వుండరాదు.

సత్యభాషణకు ముఖ్య ప్రయోజనం చిత్తనిరోధం. దాని అవాంతర ప్రయోజనం వాక్శుద్ధి. సత్యవ్రతుని వాక్కు రిత్తకాదు. అతడేమి చెప్పినా అది ఫలించవలసినదే. వారి హక్కులు శాపానుగ్రహదక్షములు. ''సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌''. సత్యము నెలకొనగా, కర్మాచరణచే కలుగు ఫలము, యోగి మాట వలనే కలుగుచున్నది. అట్టి యోగి వాక్కులు అమోఘములు. ఐతే ఈలాంటి అవాంతరప్రయోజనాన్ని ఉద్దేశించి మనం సత్యవ్రతం అనుష్ఠించరాదు. సత్మం సత్యాన్వేషణ కోసమే చేయాలి.

3. మానవ సేవయే మాధవ సేవ

అన్ని భాగ్యాలలోనూ పరమ భాగ్యమేదంటే మానవసేవయే. మనకు తెలియకుండానే మన కుటుంబానికి ఎన్నో రకముల సేవ చేస్తున్నాం. ఈ సేవ వారి వారి కుటుంబములకే పరిమితం కాక, ఇతరులకూ దేశానికీ కూడ మనమందరమూ చేయవలెనని నేను చెబుతున్నాను.

మనకు ఎన్నో శ్రమలు జీవితంలో వున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబానికి ఆహార వస్త్ర సదుపాయాలు చేయటం, వెలలు తెగపెరిగిన ఈ కాలంలో ఎంతో కష్టంగా వున్నది. ఇట్లున్నపుడు ఇవి చాలవన్నట్లు సమూహసేవ ఎక్కడ చేయగలమని మనం అనుకోరాదు. ఒక విధంగా చూస్తే, ఈ సామాజిక సేవ మన కుటుంబాలలోని కష్టాలను తాత్కాలికంగానైనా మఱచి పోవడానికి మందువలె వుంటుంది. పరోపకార పుణ్యఫలంగా భదగవదనుగ్రహం నిశ్చయంగా వుంటుంది. పరోపకారం చేయటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దాని వలన అత్మతుష్టి, సంతోషమూ కూడా కలుగుతుంది.

ఒక్క మానవులకే కాదు. నోరులేని మృగాలకు మన చేతనయినంత సాయంచేయాలి. పూర్వకాలంలో ఇష్టాపుర్తాలు చేయడమేకాక, పశువులకు దురద తీరడానికి గరకుగా వున్న రాతిస్తంభాలను అక్కడక్కడా నాటేవారు. పశువులకు ఒక పిడికెడు కసవైనా మనం వేయాలి. దీనినే గోగ్రాసమని శాస్త్రాలు చెబుతున్నవి. గ్రాసమంటే, నోరునిండే పదార్ధం. ఃుషషఠౌష అని అర్ధం. యజ్ఞయాగాదులు తర్పణశ్రాద్ధములు, ఇతర లోకాలలో వున్నవారిని ఉద్దేశించి చేయబడుతున్నవి. ఇవి మంత్రపూర్వకంగా చేయబడే సేవలు.

ఈ సమాజ సేవకు సంఘాలు ఏర్పాటుచేసుకోవాలి. సభ్యులకు ఏకాభిప్రాయం వుండాలి. వీరిలో పరస్పరం ఒద్దిక వుండాలి. ధృతీ, ధైర్యమూ, తుల్యనిందాస్తుతి స్వార్ధరాహిత్యం మొదలైన గుణాలు వుంటే ఈ సమాజసేవ బహుజన హితంగానూ పటిష్ఠంగానూ జరుగుతుంది.

ఈ సమాజసేవ ఉల్లండా మనఃక్లేశమూ దేహక్లేశమూ లేకుండా చేయాలి. కృష్ణ పరమాత్మను చూడండి. ఆయన గోవర్ధనోద్ధరణ చేసింది గోపబాలురను రక్షించడానికి. చిన్నతనంలోనే కాళియమర్ధనం చేశాడు. చూడటానికి క్రీడవలె కనబడినా అది ఆయన విషసర్పంతో చేసిన పోరాటమే. ఇదీ పరోపకార్యార్ధమే. కృష్ణలీలలన్నిటిలోనూ ఆయన పరోపకార పారీణత, కరుణా పెనవేసుకొని వుంటాయి. లౌకిక సేవ ఒక్కటే కాదు. ఆయన అర్జునుడు, ఉద్ధవుడు మొదలైన వారికి జ్ఞానబోధ కూడా చేశాడు. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ ఆయన నిర్లిప్తంగా తామరాకుపై వున్న నీటి బిందువువలె అనాయాసంగా ఆనందంగా వుండిపోయాడు.

సేవ చేసేవారికందరికీ ఈ శాంతమూ, నిర్లిప్తతా వుండాలి. అపుడే సమాజ సేవ శ్రమ లేకుండా జరుగుతుంది. సమాజసేవ నిరాడంబరంగా, నిస్వార్థంగా చేయాలి. ఇట్టి మానవ సేవ చిత్తశుద్ది కలిగించి చివరకు మాధవసేవగా పరిణమిస్తుంది.

4. చిత్త శుద్ధి కలిగించే చిన్న విషయాలు

చిత్తశుద్ధి కలగడానికి కొన్నికొన్ని చిన్న విషయాలున్నవి. మన పెద్దలు ఈ విషయాలను అతిశ్రద్ధతో అనుసరిస్తూ వచ్చినందువలన జీవితంలో వారికి తృప్తి, సంతోషం కొదవ లేకుండా వుండేవి. మనమూ వారు వెళ్ళిన మార్గాలలో అనుగమిస్తే, మనజీవితాలూ శాంతిప్రదములౌతాయి. ఆ రోజులలో స్నేహబాంధవ్యాలను వారు చక్కగా పాటించేవారు. ఒక ఇంటిలో పెండ్లి జరిగినా, లేక ఏదైనా అపరకార్యములు జరిగినా అందరూ కలసి, పరస్పర సాహాయ్యకంగా వుండేవారు. ఈ సహాయం ఈ కాలంలోవలె బాహిర ప్రకటనంగా వుండేది కాదు. బీదలకు సహాయం గొప్పలకు కాక నిజంగా వారి అభివృద్ధిని మనస్సులో వుంచుకొని చేసేవారు.

పూర్వం, బంధువర్గంలో ధనికులకూ బీదలకూ జీవనవిధానంలో పెద్ద వ్యత్యాసం వుండేది కాదు. ధనికులైనవారు బీద బంధువులకు విశేషంగా ధన సహాయం చేసేవారు. దీనిని వారు ధర్మకార్యంగా భావించి చేసేవారు. బాధితునికి మనం చేసే సహాయం, సహాయం పొందినవానికంటే, సహాయం చేసినవాని చిత్తశుద్ధికి ఎక్కువ తోడ్పడుతుంది.

కానీ ఇదంతా ఇపుడు మారిపోయింది. ఈ కాలపు జనులు పూర్వకాలపు బాంధవ్యం మరచిపోయారు. ధనికునికి సహాయబుద్ధిలేదు. పూర్వం విరివిగా అన్నదానం చేసేవారు. ఈ కాలంలో ధనికులు ఉన్నవారికే పార్టీల మూలంగా అన్నదానం చేస్తున్నారు కానీ, బీదలను గమనించడములేదు. ద్రవ్యమేమో విచ్చలవిడిగా ఖర్చవుతున్నా, ఆ ఖర్చు ధర్మానికో చిత్తశుద్ధి కోసమో వినియోగంకావటంలేదు. ఈ పార్టీలు, ఫీస్టులు ఒక కార్యార్ధమే చేస్తున్నారు. ఇందులో పరోపకార ప్రశంసలేదు. స్వార్ధమే ఉన్నది.

పూర్వకాలంలో అన్నదానమో ద్రవ్యదానమో చేసేటపుడు, దాతకూ గృహీతకూ ప్రియమూ సంతోషమూ నిండుకొని వుండేవి. ఈ కాలపు పార్టీలలో ఇవి రెండూ మృగ్యం. ఈ పార్టీలు, స్పర్ధలకూ, అసూయలకూ కారణమౌతున్నవి. ద్రవ్యరూపంగా సహాయం చేయలేనివారు, శారీరకంగానైనా ఇతరులకు తోడ్పడాలి. శ్రీమంతుడు, బీదవాడు అన్న భేదం లేకుండా సామూహిక సేవలలో పాల్గొనాలి. దారిలో పడియున్న ఒక ముండ్ల కంపను తీసివేసినా అది సహాయమే. అందరూ కలసి ఒక చెరువో బావియో త్రవ్వటమూ పరోపకారమే. అది చిత్తశుద్ధినిస్తుంది. అట్టి చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం కల్గించడమేకాక, హృదయదర్పణములలో భగవత్స్వరూపమును మనం చూడగలిగేటట్లు చేయగలదు.

5. గుణ దోషములు

మనం ధార్మిక జీవనం చేయాలంటే అన్ని విషయములలోనూ విధి నిషేధాలను పాటిస్తున్నాము అని జాగ్రత్తగా గమనించాలి. ఈ విధి నిషేధాలను ఇతరులు మనకు గుర్తు తేవడం కంటే స్వేచ్ఛగా అనుసరించడం ఉత్తమం. ఒకరి నిర్బంధము వలన విధి నిషేధాలను మనం పాటించామంటే అది గొప్పకాదు. సంప్రదాయమనేది పురాతన కాలం నుంచి మన పెద్దలు స్వయంగా ఆచరిస్తూ వచ్చినది. ఈ సంప్రదాయాలను శాస్త్రం చట్టమువలె వ్రాసిపెట్టలేదు. ''సహస్రంవద ఏకం మాలిఖ''. వేయి విషయాలు నోటితో చెప్పినా, ఒక్క విషయం కూడా వ్రాసి చూపకు - అని దీని భావం. కాని ఈ కాలపు చర్య పూర్తిగా దీనికి విరుద్ధంగా వుంది. ఎక్కడ చూచినా, దీనిని చేయ్‌, దానిని చేయ్‌ - అని నోటీసులు కొల్లలుకొల్లలుగా చూస్తున్నాం. నేను పూజ చేస్తున్న స్థలంలోనే ''మాట్లాడవద్దు, చొక్కా వేసుకోవద్దు'' అన్న నిషేధ వాక్యాలు వ్రాసి బోర్డులు తగిలిస్తున్నారు. ఇకమీదనైనా ఇలాంటివి లేకుండా ఉండుట మంచిది.

మన పెద్దలు, ఒకరిలో ఏ లవలేశమైన గుణమున్నా దానిని గమనించి, శ్లాఘించేవారు. దోషదర్శనం చేసేవారు కాదు. చంద్రునిలో కళంకమున్నది. అందుచేత అతనికి దోషాకరుడన్న పేరున్నది. కాని కళంకమున్న చంద్రుణ్ణి పరమశివుడు తన శిరస్సులో వుంచుకొని, తన ఉత్తమాంగంలో ఉత్తమ స్థానాన్ని యిచ్చాడు. ఆ ఈశ్వరుడే కరాళమైన విషాన్ని, గరళాన్ని తన కంఠంలో వుంచుకొని గరళకంఠుడైననాడు. ఈ విషయాన్ని దండి అనే సంస్కృత కవి ఒక శ్లోకంలో వ్రాశాడు.

కానీ ఈ కాలంలో గుణదోష విమర్శ విరివిగా సాగుతున్నది. అందులో చక్కగా చదువుకొన్నవారు దోషదర్శనాన్ని మరింత చక్కగా చేస్తున్నారు. విద్వాంసుడు అంటే దోషజ్ఞుడనే లక్షణమొక్కటి వున్నది అని వాదించవచ్చును. దోషజ్ఞుడు అంటే దోషమును తెలుసుకొన్నవాడని అర్ధమే కానీ దానిని ప్రచారం చేసేవాడని కాదు. దోషములను తెలుసుకోవలసినదే. వానిని చేయకుండా ఉండేటట్లు చూడాలి. దోషం చేసిన వారికి హితం చెప్పాలి. కాని, వారిని చిన్న చూపు చూడరాదు. దోషప్రచారం ఎన్నడూచేయరాదు.

మనమే దోషభూయిష్ఠలముగా వుంటే ఇతరులకు వారి దోషాలను ఎట్లు చూపగలము? మనకు దోషములు చూపగల యోగ్యతాస్థానము ఉంటేనే ఇతరులకు వారి దోషములను చూపాలి. అంతేకాదు, వారు మన మాటకు విలువ ఇస్తారన్న నమ్మకముంటేనే వారికి చెప్పాలి. ఒకరి మంచిని చూచి శ్లాఘ్య వచనములు పలికామంటే అది వారికి ఉత్సాహవర్ధకంగా వుంటుంది. కాని పొగడ్త కూడ మితిమీరరాదు. మనం ఒకే ధాటిలో స్తోత్రం చేసి వారి అహంకారాన్ని పెంపొందించరాదు. అందులకే సమక్షంలో గురువు, ఈశ్వరుని మాత్రమే స్తుతించాలన్న నియమం ఉన్నది.

మనం స్తోత్రం చేయాలంటే జాగ్రత వహించాలి. బంధు మిత్రులను పరోక్షంలో పొగడవలెనే కానీ ప్రత్యక్షంగా పొగడరాదు. సేవలకులను పని పూర్తికాగానే మెచ్చుకోవచ్చును. తండ్రి తన కుమారుణ్ణి ఏనాడూ ప్రత్యక్షంగా మెచ్చుకోరాదు.

ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్ర బాంధవాః
కార్యాంతే దాస భృత్యాశ్చ న స్వపుత్రాః కదాచన ||

నేను ఇంతసేపూ మీ దోషం చూపాను. తండ్రి పిల్లల ముందు వారి గుణగానం చేయరాదు. వారి తప్పులు కావలిస్తే, దిద్దుకోడానికి చూపవచ్చును అని శాస్త్రం చెబుతున్నది. అందుచేత నేను మీ దోషాలను చూపటంలో దోషం లేదు మరి!

Wednesday 20 April 2016

జయేంద్రవాణి : సత్సాంగత్యం ఎందుకు అవసరము ?



జయేంద్రవాణి : సత్సాంగత్యం ఎందుకు అవసరము ?
(జగద్గురువులు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతీ సంయమీంద్రుల అనుగ్రహభాషణములనుండి)

ఒకానొకప్పుడు ధర్మపుత్రుడు, దుర్యోధనుడు కలిసి ఒక చోటకు వెళ్లారు. మామూలుగ వారిద్దరూ కలిసి బయటకు వెళ్లటం జరిగేది కాదు. వారు జ్ఞాతులైన, బాల్యం నుండి వారి మధ్య సఖ్యత లేని కారణంగా వారు చాల అరుదుగా కలిసి సంచరించే వారు. కాని ప్రపంచంలోని పలుప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారో పరిశీలిద్దామని వారిరువురు కలిసి వెళ్లటానికి నిశ్చయించుకున్నారు.

ఒక రోజున ధర్మపుత్రుడు, దుర్యోధనుడు ఒక నగరాన్ని చూట్టానికి వెళ్లారు. ధర్మపుత్రుడు ప్రతి దాంట్లోను మంచిని మాత్రమే చూడగల్గితే, దుర్యోధనుడు వానిలోని చెడును మాత్రమే దర్శించ గల్గుతున్నాడు. ఒకే విషయం ఒకరికి మంచిగా తోస్తే అదే విషయం రెండవ వానికి చెడుగా కన్పిస్తుంది. ఇది ఎలా సంభవం? ఇచ్చట సమస్య వ్యక్తి తాను పరిశీలించిన పూర్తి విషయంపై ఏర్పడే మానసికధోరణి మాత్రమే. వస్తుదోషం అంటూ ఏమీ ఉండదు.

వారు అలా వెళుతుండగా మాంసవిక్రయం కొరకు జంతువధ చేస్తున్న ఒక కసాయి వాడు వారిద్దరకు కనిపిస్తాడు. తన జీవనోపాధి కొరకై జంతువులను వధిస్తున్నాడు గనుక కసాయి వానిని ధర్మపుత్రుడు చెడ్డవాణ్ణిగా తలంచాడు. కసాయివాడు చేసేపని అక్రమమైనది గనుక అతడు చెడ్డవాడేనని దుర్యోధనుడు కూడ అంగీకరించాడు. వారిరువురు ఈ విషయంపై ఏకాభిప్రాయం కల్గియుండటం చాల అరుదైన సంఘటనే. జంతు హింస పాపమని యిరువురు విశ్వసించారు. ఇరువురు కసాయివాడు చెడ్డవాడనే అభిప్రాయాన్ని సమర్థించారు.

కొంత సేపయిన తర్వాత ఆ కసాయివాడు ఆ మాంసంలో కొంత భాగాన్ని తన దుకాణం బయట కుక్కలకు ఆహారం గాను, మరి కొంత భాగాన్ని మాంసాహారులైన పక్షులకు ఆహారంగాను వేయటం వారు గమనించారు. అలా చేసిన తర్వాతనే కసాయివాడు తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదిజూచి ధర్మపుత్రుని హృదయం స్పందించింది. నిస్సందేహంగా ఇతడు తన జీవనోపాధికై జంతువధ చేస్తున్నాడు. ఐనా కొంత మాంసాన్ని జంతువులకు, పక్షులకు ఆహారంగా యిచ్చి తన ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాతనే తన వ్యాపారాన్ని ఆరంభిస్తున్నాడు. మనం మన భోజనానికి ఉపక్రమించే ముందు చుట్టుప్రక్కల అతిధులెవరైనా ఉన్నారేమో నని చూచి వారికి భోజనం పెట్టిన తర్వాతనే మనం భుజించాలి. ఇలాంటి ధర్మం మరొక చోట చూడం. ఇది మనదేశంలో మాత్రమే చూడగలం. ఇది ధర్మాన్ని గురించిన అతని అవగాహన.

ప్రతిదినం మనం కూడ చాల జీవరాసుల్ని చంపుతాం. బెండకాయ, దోసకాయ, వంకాయ, పొట్లకాయ మొదలైన కూరగాయల్ని తరుగుతాం. వీటన్నిటిలోనూ ప్రాణం ఉంది. మనం తినే బియ్యం కూడ ప్రాణం గలదే. ఐనా మనం భుజిస్తాం. కొంత మంది సపోటా పండు తింటారు. కాని మరికొందరు దాని రంగునకు ఇష్టపడక దాన్ని తినటానికి ఆసక్తి చూపరు. కనుక ఒక వస్తువు పట్ల వ్యక్తి కనబరచే మానసిక వైఖరి మీదే అంతా ఆధారపడి ఉంటుంది. అందుచే ప్రతివాడు తన చిత్తప్రవృత్తిని బట్టి పనులను చేస్తాడు. విషయాలను పరికిస్తాడు. కసాయివాడు పాపకార్యమైన జంతువధను చేస్తున్నప్పటికి కొంత మాంసాన్ని ఇతర ప్రాణికోటికి ఆహారంగా యిచ్చికాని తన వ్యాపారాన్ని ప్రారంభించటం లేదు. ఐతే వ్యాపార మంటేనే మోసాలు, అబద్ధాలు అప్రమాణాలు మొదలైన అన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడాల్సి ఉంటుంది. ఐనా కసాయివాడు తన వ్యాపారాన్ని ఆరంభించక ముందే ఒక ధర్మమైన పనిని చేసేవాడు. అప్పుడు ధర్మపుత్రుడు ఆలోచించ ప్రారంభించాడు. ''మొదట కసాయివాడు చాల చెడ్డవాడని నిర్ధారించాను. కాని అతనిలో కూడ మంచితనం ఉందని ఇప్పుడు అభిప్రాయపడుతున్నాను.'' దాన్ని గురించి పదేపదే ఆలోచించి తనలో ఇట్లా అనుకున్నాడు ''నేను ఇన్నాళ్లూ దుర్యోధనునితో కలిసి ప్రయాణిస్తున్నాను. కనుక అతని వాసనా బలం నాలో ప్రవేశించింది. నా ధర్మ నిర్ణయంలో పొరపాటు మొదట జరిగిందంటే దానికి కారణం అతని సాహచర్యమే.''

కాబట్టి సాహచర్యమే ఈ తేడాలకు కారణ భూతమౌతుంది. ఇచ్చట దృష్టిదోషం తప్ప వస్తుదోషం ఏమీ లేదు. అనగా వస్తువులో ఏ లోపం లేదు. లోపమల్లా మన దృష్టిలోనే. మనకు సత్సాంగత్యం, దేవాలయాలకు పోవుట, భగవంతుని కొలుచుట, మతపరమైన ప్రవచనాలు వినుట మొదలైన సత్కాలక్షేపాలు సమకూరితే ప్రతిది మనకు మంచిగా కన్పిస్తుంది. ప్రజలందరు మన దృష్టిలో సత్పురుషు లౌతారు. కనీసం అలాంటి సమయాల్లో నైనా మనకు మంచి భావాలు కల్గుతాయి, మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి, మంచిగా ప్రవర్తిస్తాం. ఇతర సమయాల్లో మనం చెడుగా ప్రవర్తించవచ్చు, చెడ్డ వారం కావచ్చు. సత్పురుషులెప్పుడూ ప్రతి విషయాన్ని సమదృష్టితో సరియైన స్థితిలో చూస్తారు. సాహచర్యం మారినా, పరిసరాలు చెడినా, విలువలు నిర్ణయాలు తారుమారౌతాయి. ఇది చాలమంది సాధారణ వ్యక్తులలో సంభవిస్తుంది.

రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు ఏ పరిసరాలలో నున్న వారు చెడ్డవారే. పరిసరాల ప్రభావం వారిపై ఏ విధంగాను పడదు. కాని మన విషయంలో దోషం మన బాహ్య చర్మం పైనే ఉంటుంది. మన రక్తంలోకి అది చొరబడలేదు. రక్తం పరిశుద్ధంగా ఉన్నంత వరకు, సత్సాంగత్యంలో మనం గడిపినంత వరకు ప్రతి విషయంలోను మనం మంచినే చూస్తాము. మన వివేకం, బుద్ధి కూడ మంచి స్థితిలో ఉంటాయి. పరిసరాలు, సహచర్యం చెడుగా పరిణమించి నప్పుడే మనం చెడుగా మారుతాం.

మనం మన సంస్కృతిని, మతాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే చాలు మంచి వారమౌతాం. దుష్ట వాతావరణమున్నా అది దానంతట అదే అదృశ్యమౌతుంది. ఒక వేళ వున్నా కొంతకాలం వుండి వెంటనే రహిత మౌతుంది.

కనుక పరిసరాల్ని మెరుగు పరచుకునే ప్రయత్నం మనం చేయాలి. మనకు మన మతం, మన ధర్మాలు, చేయవలసిన విధులు వున్నాయని గుర్తుంచుకోవాలి. మన ఆచార వ్యవహారాలతో బాటు మన సంప్రదాయాలను, సంస్కృతిని కూడ మనం కాపాడుకోవాలి.

ప్రాథమిక మత సిద్ధాంతాలను అవగాహన చేసికొని సగుణోపాసన ద్వారా భగవదారాధన చేయటమే మన కనీస కర్తవ్యం. మనం సత్సాంగత్యాన్ని, పుణ్యపురుషుల సహచర్యాన్ని సమ కూర్చుకొని స్వధర్మాల్ని నిర్వర్తిస్తూ మంచి పరిసరాల్ని సృష్టించుకోవాలి. అడ్డంకుల భయాన్ని గాని, నిస్పృహని గాని దరిచేరనీయ నవసరం లేదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో మనగల్గటానికై మన ప్రాచీనమైన, గొప్పదైన మతాన్ని పుష్టికరం కావించుచూ, దాని పునరుజ్జీవనానికై మనలో ప్రతివాడు తనవంతు కృషి చేయాలి.

Tuesday 19 April 2016

పరమాచార్యుల అమృతవాణి : మిత వ్యయం



పరమాచార్యుల అమృతవాణి : మిత వ్యయం
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

మన కాలమంతా ద్రవ్యార్జలోనే గడచిపోతున్నది. ఈ ద్రవ్యాన్ని మనం సరిగా ఖర్చు పెట్టుతున్నామా అని యోచించాలి. మనం ఏ వస్తువునూ అవసరానికి అధికరించి కోరకూడదు. ఒక వస్తువు కొనేటపుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చునో అంత తక్కువ ధరలో కొంటాము. కానీ ఆ వస్తువు మనకు అవసరమా అన్న విషయం ఆలోచిస్తున్నామా? వస్తు సముదాయాన్ని వృధా చేసుకొంటూ పోవడం వలన మనకు సుఖం అధికమౌతుందని అనుకోవటం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. దానికి కావలసిన ధనం మాత్రం ఆర్జిస్తే చాలు. ఈ విషయం మనం గుర్తించగలిగితే, మన ఆచారాలు, అనుష్ఠానాలు వదలుకొని దేశాంతరాలకు పోయి విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు. ఆత్మ విచారానికీ, ఈశ్వరధ్యానమునకూ, పరోపకారమునకూ మనకు వలసినంత కాలము కావాలంటే అవసరాలకు మించి వస్తువులను సముపార్జన చేసే లౌల్యమును వదలిపెట్టాలి.

మనం రెండు విధాలుగ కాలాన్ని వ్యయం చేస్తున్నాము. ఒకటి ధనానికోసం వెచ్చించే సమయం, రెండవది ధనార్జనతో సంపాదించిన వస్తువుల రక్షణలో వెచ్చించే సమయం. ఈ రెండూ మనకు మిగిలితే ఆ మిగిలిన కాలంలో ఆత్మ తుష్టికరములైన సాధనలను చేసి జీవితం శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ తృప్తిగానూ గడపవచ్చును.

ఈ పొదుపు, వస్తువుల విషయంలోనే కాదు. సంభాషణలలోనూ పొదుపు ఉండేటట్లు చూడాలి. పదిమాటలలో చెప్పవలసిన విషయం ఒక్కమాటలో చెప్పగల సామర్ధ్యాన్ని మనం సంపాదించాలి. ఎప్పుడు మనకు ఈ విధమైనా వాచాసంయమన మేర్పడుతున్నదో, బుద్ధిలో ఒక తీక్షణమూ, వాక్కులో ఒక ప్రకాశమూ మనం స్ఫుటంగా చూడగలము. మన వాక్కులు వ్యర్ధంకారాదు. 'మౌనేన కలహం నాస్తి'. మితభాషణ వలన మనశ్శాంతీ ఆత్మ శ్రేయస్సూ వృద్ధి ఔతాయి.

కానీ ఈ కాలంలో మనం చూస్తున్నదేమంటే వృధావాగాడంబరం. దినపత్రికలు తెరచామంటే, మనం చూచేదంతా వివిధ కక్షలకు చెందిన నాయకుల ప్రసంగాలే. కార్య దక్షత లేకున్నా మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తాము చేయలేని కార్యక్రమముల లోపాన్ని ఈ వాగ్విజృంభణలో వీళ్ళు కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తారు. పొదుపు అనే విషయం ఒక్క చేతలోనే కాక మాటలలోనూ వుండవలె.

అబ్బ కోరికలూ, సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. క్రొత్తక్రొత్త సంకల్పములు ఉదయించకుండా చూసుకొంటే, కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలూ, ధనార్జనా, వస్తు సంపాదనా తగ్గుతూ వస్తాయి. సంకల్పములు క్షీణించవలెనంటే సద్వస్తు ధ్యానముండాలి. అపుడు చిత్తవృత్తులు సమసిపోయి ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం.

మనం సంపాదించే ధనమంతా స్వార్ధంకోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలో సత్కార్యాలకోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతోమంది వున్నారు. లోకంలో ఎంతో మంది దుఃఖితులూ దరిద్రులూ వున్నారు. వారు కష్టపడుతుంటే మనకున్నదికదా అని మనం వృధాగా ధనమును ఖర్చు పెట్టడం పాపం. మనధనంతో దీనుల దుఃఖాశ్రువులను తొలగించగలిగితే అంతకంటే పుణ్యకార్యం వేరే వుండదు. ధనం వుంటే మాత్రం చాలదు. దానిని సద్వినియోగం చేస్తున్నామా, పరోపకారానికి అది ప్రయోజనపడుతున్నదా, దీన జనోద్ధరణ దీని వలన జరుగుతున్నదా అని మనం జాగ్రత్తగా గమనించవలె. ధనం సద్వినియోగం అయ్యేకొద్దీ, మనకు లక్మీకటాక్షం కూడా సమృద్ధిగా వుంటుంది.

పరమాచార్యుల అమృతవాణి : ఆస్తిక్యబుద్ధితో శాంతి



పరమాచార్యుల అమృతవాణి : ఆస్తిక్యబుద్ధితో శాంతి
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

గడచిన అర్ధశతాబ్దములో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాచరికం, సామూహిక విధానం, విజ్ఞానం, గృహజీవనం - వీటన్నిటిలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చినవి. ఐదువేల ఏండ్లుగా నడుస్తున్న జీవనవిధానం, ఒక్కపెట్టున ఈ అర్ధశతాబ్దంలో తలక్రిందులుగా మారిపోయింది. ఈ అనుభవాన్ని తఱచిచూస్తే, చాలగొప్ప మార్పులు ఏర్పడినవని మనం సులభంగా గ్రహిస్తాం. ఈ అనుభవాల మధ్య ఒక్క విషయం మనకు స్ఫుటంగా గోచరిస్తుంది. మానవానీకం శాస్త్రనిష్ఠనుంచీ, భగవద్ధర్మము నుండి ఎంతెంత వైదొలగుతున్నదో అంతంత చిక్కులపాలవుతున్నది అని మనం సులభంగా తెలుసుకొంటాము. సైన్సు అభివృద్ధి అయిన కొద్దీ అన్ని దేశాలలోనూ ఒక అశాంతి తలెత్తి ప్రజలలో నెమ్మది లేకపోయింది. మున్ను ప్రజలలో వున్న నిశ్చింత, నెమ్మదీ, సౌజన్యం పూర్తిగా లోపించినదనే అనాలి. మనిషి కుశాగ్ర బుద్ధియై శక్తులను వశపఱచుకొన్నందువలన వచ్చిన ఆపదే ఇది.

సరే వ్యాధిని తెలుసుకొన్నాం. దీనికి మందేమి? భగవదావేశితమైన మనస్సులో అశాంతీ, భీతీ ఎన్నడూ వుండదు. ఈ కాలంలో పోలీసుస్టేషన్లూ, న్యాయస్థానాలు కొల్లలుకొల్లలుగా వున్నాయి. ప్రభుత్వం వీని విషయంలో జాగ్రత్తగానే వున్నది. కానీ ప్రజలలో ఆస్తిక్యం ప్రబలమయ్యే పనులు మాత్రం ప్రభుత్వం చేయటం లేదు. ప్రభుత్వం మతబోధనలు గూర్చీ, నైతిక బోధనలు గూర్చీ అస్తమానమూ మాట్లడుతున్నా కార్యరూపంలో మాత్రం ఏవీ కనబడటంలేదు. మన పెద్దలు అనుదినమూ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు' అని ప్రార్ధించేవారు. ఈ ప్రార్ధన సర్వమత సమత్వ చిహ్నం. అందుచేత ప్రజా శాంతి కొఱకు మనమందరమూ, ఆస్తిక్యం పెంచుకొని, పరస్పర వైషమ్యులులేక, ఒద్దిక కలగి మెలగటం అలవాటు చేసుకోవాలి.

పరమాచార్యుల అమృతవాణి : లోకక్షేమానికి క్షాత్రధర్మము



పరమాచార్యుల అమృతవాణి : లోకక్షేమానికి క్షాత్రధర్మము
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

మన పెద్దలు పరోపకారార్ధమిదం శరీరం అని అన్నారు. మన దేహములో జవసత్త్వములున్నపుడే మనం ఇతరులకు శారీరకంగా సహాయం చేయగలుగుతాము. శరీర బలము ఒక్కటే కాదు, జీవితంలో ఆచారాలను క్రమంగా పాటించే ధర్మనిష్ఠ, అభయం బాటలలో ఋజుత్వం వుంటేనే మనం ఇతరులకు చేసే సేవ ఫలవంతం ఔతుంది. ఇటువంటి సేవా భావమునకు మనకు ఆదర్శంగా వుండేది ఎవరంటే, ఆంజనేయస్వామియే. వారు ఎప్పుడూ శాంతంగా వుండేవారు, ఆగ్రహం వచ్చిందంటే ఎవరినీ లెక్కచేయక, శతృవులను హతమార్చేవారు. వారికి బుద్ధిబలము ఎక్కువ. వారి స్వరూపమే వినయము. వారి హృదయం అనుక్షణమూ రామనామ స్మరణ చేస్తూ నామామృత రసానందంలో తేలిపోతూ వుండేది.

తాముగ ఎవరినీ హింసించేవారు కాదు. ఎవరయినా హింస చేయడానికి పూనుకొంటే ప్రతీకారం చేసేవారు. అంతే. స్వార్ధం కోసం తమ బలాన్ని ఎన్నడూ వారు వాడుకోలేదు. కానీ ఆ బలాన్ని దుర్బలులకు అండగా వుంచటానికి ఎన్నడూ వారు వెనుదీయలేదు. కానీ ఆ బలాన్ని కూడ ఇట్టి ఉదారపురుషుడే. ఆంజనేయస్వామి అవతారమని పరిగణింపబడే శ్రీ సమర్ధరామదాసు యొక్క అత్యంత ప్రియమైన శిష్యుడు శివాజీ. అందుకే వారికి అట్టి అమూల్య గుణసంపత్తి ఏర్పడింది.

మనకు దేశభక్తి వుండాలి. దేహంలో జవసత్వములుండాలి. వానితోబాటు సార్వకాలిక అభయస్థితి మనం భజించాలి. నిర్భయంతోపాటు స్వార్ధరాహిత్యం, పరోపకార పారీణత, అలవఱచుకోవాలి. ఈ గుణ సంపత్తినే క్షాత్రధర్మమని అంటారు. 'క్షతాత్‌ కిల త్రాయతే ఇతి క్షత్రం' ఇతరులను అపాయం నుంచి కాపాడుటే క్షాత్రం. మన యువకులకు ఈ క్షాత్ర ధర్మం ఎంతో అవసరం. బలిష్ఠులను చూసి మనం భయపడరాదు. ఎవరయినా మృగప్రాయంగా ప్రవర్తిస్తూ హింసకు పూనుకొన్నాడంటే ఎదిరించి సర్వత్యాగానికి సిద్ధంగా వుండాలి.

ఈ కాలపు తీరు చూస్తే మనలో క్షాత్రం పూర్తిగా లోపించిందనే అనాలి. ఎక్కడ చూచినా సమ్మెలు, నిరశన వ్రతములు, ఇండ్లను, ఆస్తులను, బస్సులను, బండ్లనూ తగల పెట్టడం ఇవీ ఈ రోజులలో మనకు కనబడే దృశ్యాలు. ఇదంతా బలవంతుల చిహ్నంకాదు. బలహీనుల చిహ్నమే. ఇతరులను హింసించడమే వీరి ఉద్దేశం. ఇట్టి వాతావరణంలో ప్రజల బలహీనత, ప్రభుత్వంలోనూ ప్రతిఫలిస్తుంది. ఈ దేశంలో భయం లేకుండా తలెత్తుకొని తిరగవలెననికోరుకొంటే, మరల మనమందరమూ క్షత్ర ధర్మాన్ని అభివృద్ధి చేయాలి. పరోపకార పారీణులు, శీలవంతులు, సత్యసంధులు, ఋజుప్రవర్తకులు అందరూ కలియకూడి దౌర్జన్యాన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. లోక క్షేమానికి ఈ క్షత్రధర్మమెంతో అవసరం. అపుడే దేశంలో సుఖశాంతులు. మన రాజ్యాంగం చక్కబడవలెనంటే దారి ఇదే.

పరమాచార్యుల అమృతవాణి : సౌశీల్యం కలగటానికి మార్గము



పరమాచార్యుల అమృతవాణి : సౌశీల్యం కలగటానికి మార్గము

మనకు శీలసంపత్తి కలుగవలెనంటే వేదోక్తములైన ఆచారఅనుష్ఠానములను పాటించాలి. సదాచారము, సద్గుణములు అలవరచుకోవాలి. మంచి మనస్సున్న వాడే శీలవంతుడు కాగలడు. అందరూ సుమనస్కులుగా ఉండుటకు వీలు కావటంలేదు. మనసులో ఏ సందర్భములోనూ చెడుతలంపులు తలెత్తకుండా ఉంటేగానీ, సౌజన్యం ఏర్పడదు. అందరి మనస్సులలో సద్భావం కలగుటకొరకే శాస్త్రవిధులు, అనుష్ఠానాలూ మనమతం నిర్దేశించినది. పూజా పునస్కారములు, నైశ్వదేవం అతిథి సత్కారము, మొదలైనవన్నీ చిత్తశుద్ధి కలగడానికీ, సౌజన్యం సౌశీల్యం పెంపొందించుట కొరకూ ఏర్పడినవే. వీనికి అలవాటు పడితే మనస్సులో దురాలోచనలు ప్రవేశించుటకు సమయముకానీ, అవకాశముకానీ ఉండదు.

రెండవది మనం కర్మానుష్ఠానములను చేయునప్పుడు అహంకారానికి దారితీసే కర్తృత్వభావము అసలే ఉండరాదు. కర్మానుష్ఠానము చేయవలెననే సంకల్పమూ, చేసే శక్తీ, వసతులూ అన్నీ ఈశ్వరునివే. ఈ విధంగా మన పూర్వ వైదిక మతాచార్యులు తాము ఆచరించి మనకు మార్గనిర్దేశనం చేశారు.

ఒక అద్దంలో మన బింబం చూచుకోవాలంటే, అది శుభ్రంగా ఉండాలి. అది మకిలితో ఉంటే బింబం మసకమసకగా ఉంటుంది. అంతేకాదు అద్దం నిశ్చలంగా ఉండాలి. కదలుతూ ఉంటే బింబమూ చెదరుతూ ఉన్నట్లు అగపడుతుంది.

మన చిత్తం దర్పణం లాంటిది. ఆ చిత్త దర్పణంలో పరమాత్మను దర్శించాలంటే, చిత్త చాంచల్యం లేక స్థిరంగా, మాలిన్యరహితమై స్వచ్ఛంగా ఉండాలి.

మనింట్లో ఒకపాతరాగి పాత్ర ఉందనుకొందాం. అది బావిలో పడింది. కొన్ని ఏండ్లు నీళ్ళలోనే ఉంది. బయటకు తీసి దానిని శుభ్రపరచవలనంటె ఎంత శ్రమపడాలి? అట్లే అనేక జన్మలనుంచి మనం తెచ్చుకొన్న మలిన సంస్కార దూషితమైన ఈ చిత్తాన్ని ఎంత శ్రమపడితే శుభ్రం చేయగలం? అనేక జన్మసంపర్గమైన చిత్తమాలిన్యాన్ని ఎన్నో సత్కార్యములు చేస్తేకాని పోగొట్టుకొనలేము. అంతేకాదు. ఒక్కరోజు సత్కార్యం చేసి ఊరకుంటే చాలదు. ఈ సదాచారములను అనుదినం అనుష్ఠించాలి. అపుడే చిత్తనైర్మల్యం స్థిరంగా ఉండగలదు. ఇట్లు చేస్తూచేస్తూ రాగా ఒకరోజు ఈ చిత్తమనేది పలాయనమౌతుంది. ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది.

అందుచేత ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచారా సంపత్తీ ఉండాలి. ఆత్మలాభానికి శీలం ఎంతో ముఖ్యమైనదన్న విషయం ఏనాడూ మరువరాదు.

Monday 18 April 2016

శంకరస్తోత్రాలు : గణేశ పఞ్చరత్నస్తోత్రము







శంకరస్తోత్రాలు : సువర్ణమాలాస్తుతిః



॥ శ్రీ శంకరాచార్య కృతః సువర్ణమాలాస్తుతిః ॥

అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో ।  
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 1 ॥

ఓ ప్రభూ! నీ గుణములలో కొన్నిటితో ఏదో విధముగా నానాలుకను పవిత్రము చేసెదను. జగన్మాతతో కలిసిఉన్నవాడా! ఎల్లపుడూ శుభము నిచ్చువాడా! శంభో! మంగళము కలుగచేయువాడా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఆఖణ్డలమదఖణ్డనపణ్డిత తణ్డుప్రియ చణ్డీశ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 2 ॥
ఇంద్రుని మదమనణుచుటలో నిపుణుడైన నందీశ్వరునకు ప్రియమైనవాడా! చండీశుడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఇభచర్మామ్బర శమ్బరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో । 

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 3 ॥
గజ చర్మము ధరించినవాడా! శంబరుని శత్రువగు మన్మథుని దహించిన ఉజ్జ్వల నేత్రముగలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 4 ॥
లోకములను పాలించువాడా! కైలాసముపైనుండువాడా! మానవులనేలువాడా! పరాశక్తికి పతియైనవాడా! మహేశా! సర్పాభరణములు కలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఉమయా దివ్యసుమఙ్గలవిగ్రహయాలిఙ్గితవామాఙ్గ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 5 ॥
దివ్యమణ్గళ విగ్రహముకల పార్వతిచే ఆలింగనము చేయబడిన శరీరపు ఎడమభాగము కలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 6 ॥
ఓ స్వామీ! తెలివిలేనివాడను మరియు అనాథను అగు నన్ను దరిచేర్చుకొని నా పాపములను దూరం చేయుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఋషివరమానసహంస చరాచరజననస్థితిలయకారణ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 7 ॥
ఋషిశ్రేష్టుల మానసములో చరించు ఓ హంసమా! చరాచరముల జననము, స్థితి మరియు లయలకు కారణమైనవాడా ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ౠక్షాధీశకిరీట మహోక్షారూఢ విధృతరుద్రాక్ష విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 8 ॥
నక్షత్రనాథుడగు చంద్రుని కిరీటముపై ధరించువాడా! మహావృషభము నధిరోహించినవాడా! రుద్రాక్షలు ధరిమ్చినవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఌవర్ణద్వన్ద్వమవృన్తసుకుసుమమివాఙ్ఘ్రౌ తవార్పయామి విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 9 ॥
ఓ ప్రభూ! తొడిములులేని మంచి పుష్పములవలే ఉన్న ఌ, ౡ అను అక్షరములను నీపాదమునందు సమర్పించుచున్నాను. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 10 ॥
ఓ శివా! " ఏకం సద్విప్రాబహుధావదన్తి"( ఒకే పరమాత్ముని విజ్ఞులు బహువిధములగా వర్ణించుచున్నారు) అను శృతిలోని సుద్రూపము ( పరమాత్మ) నీవే అని ఉపాసించుచున్నాము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఐక్యం నిజభక్త్యేభ్యో వితరసి విశ్వమ్భరోఽత్ర సాక్షీ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 11 ॥
ఓ ప్రభూ! నీ భక్తులను నీలో ఐక్యము చేసుకొనుచున్నావు. దీనికి విశ్వంభరుడగు నీవే సాక్షి. ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాఽస్మాకం మృడోపకర్త్రీ భో ।
 సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 12 ॥
సుఖకరుడవగు ఓ దేవా ! మాయాస్వరూపమైన ఓంకారము నిన్ను నిర్దేశించుచూ మాకు ఉపకారము చేయుచున్నది.ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగమ్బరతా చ తవైవ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 13 ॥
ఓ ప్రభూ ! నీ దిగంబరత్వము నీకు సుఖముల పట్ల ఉదాశీనతను స్పష్టము చేయున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

అన్తఃకరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 14 ॥
ఓ ప్రభూ! చిత్త శుధ్ధిని మరియు నీయందు స్థిరభక్తిని ప్రసాదించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

అస్తోపాధిసమస్తవ్యస్తై రూపైర్జగన్మయోఽసి విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 15 ॥
ఓ ప్రభూ! నిరాకారుడ వైననూ నీవు చరాచరములు రూపములతో ప్రపంచమమ్తా నిండి ఉన్నావు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

కరుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 16 ॥
ఓ కరుణాసముద్రుడా! దాసుడనైనా నాపై నీవు ఔదాసీన్యము వహించుట ఉచితము కాదు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఖలసహవాసం విఘటయ సతామేవ సఙ్గమనిశం భో ।
 సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 17 ॥
ఓ స్వామి! నాకు దుష్టసహవాసమును తెగగొట్టి సజ్జనమైత్రిని సదా కల్పించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

గరళం జగదుపకృతయే గిలితం భవతా సమోఽస్తి కోఽత్ర విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 18 ॥
ఓ ప్రభూ! ప్రపంచమునకు ఉపకారముచేయుటకై నీవు విషము మింగితివి. నీతో సమానుడెవడు? సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఘనసారగౌరగాత్ర ప్రచురజటాజూటబద్ధగఙ్గ విభో ।
 సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 19 ॥
ఓ ప్రభూ! ముద్దకర్పూరము వలే తెల్లని శరీరము కలవాడా! దట్టమైన జటాజూటముతో గంగను ధరించినవాడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

జ్ఞప్తిః సర్వశరీరేష్వఖణ్డితా యా విభాతి సాత్వం భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 20 ॥
ఓ స్వామి ! శరీరములన్నిటిలో ఒకటిగా వెలుగొందు చైతన్యము నీవే. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

చపలం మమ హృదయకపిం విషయద్రుచరం దృఢం బధాన విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 21 ॥
ఓ ప్రభూ! ఇంద్రియ సుఖములచే చెట్టుపై సంచరించు చపలమైన నా హృదయమనే కోతిని ధృఢముగా బంధించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఛాయా స్థాణోరపి తవ పాపం నమతాం హరత్యహో శివ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 22 ॥
ఓ స్వామి! నీవు స్థాణువు అని పిలువబడుచున్నావు. (స్థాణువనగా స్థిరమైనవాడు మరియు కొమ్మలు లేని మోడు అని రెండర్థములు) ఐననూ నీనీడ భక్తులు సంతాపనము పోగొట్టుచున్నది. ఓ సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

జయ కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో ।
 సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 23 ॥
ఓ ప్రభూ! కైలాశ నివాసా! ప్రమథ గణాధీశా ! బ్రాహ్మణులచే పూజింపబడువాడా! నీకు జయమగుగాక. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఝణుతకఝిఙ్కిణుఝణుతత్కిటతకశబ్దైర్నటసి మహానట భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 24 ॥
నటరాజువగు ఓ దేవా ! ఝణుతక ఝంకిణు ఝణుతత్కిటకిట అను తాళధ్వనితో నీవు నటించుచున్నావు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురూస్త్వమేవ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 25 ॥
ఓ ప్రభూ! చాంచల్యములేని స్థిరమైన జ్ఞానమునుపదేశించుము. నీవే గురువవు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

టఙ్కారస్తవ ధనుషో దలయతి హృదయం ద్విపామశనిరివ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 26 ॥
ఓ స్వామీ! నీ ధనుష్టంకారము పిడుగువలే శత్రుహృదయమును భేదించుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఠాకృతిరివ తవ మాయా బహిరన్తః శూన్యరూపిణీ ఖలు భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 27 ॥
ఓ దేవా ! ఠ అను అక్షరము వలే నీ మాయ బయట మరియు లోపల శూన్యముగా ఉన్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

డమ్బరమమ్బురుహామపి దలయత్యనఘం త్వదఙ్ఘ్రియుగలం భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 28 ॥
ఓ స్వామీ! నీ పాదముల జంట పాపమనే బురద అంటనిదై పద్మముల ఆడంబరమును అణుచుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కర భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 29 ॥
ఢక్క, రుద్రాక్షమాల, శూలము మరియు బ్రహ్మకపాలములతో విరాజిల్లు హస్తములు కల ఓ స్వామి! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ణాకారగర్భిణీ చేచ్ఛభదా తే శరణగతిర్నృణామిహ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 30 ॥
ఓ స్వామీ! ’ణ’ అను అక్షరము మధ్యలో ఉన్న నీ బాణగతి ఈ లోకములో మానవులకు శుభమునిచ్చుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

తవ మన్వతిసఞ్జపతః సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 31 ॥
ఓ దేవా! నీ మంత్రములు ఎక్కువగా జపించుటవలన మానవుడు సంసారసాగరమును తరించుచున్నాడు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 32 ॥
ఓ ప్రభూ! నీ నామము జపించనివాడి ముఖము "థూత్" అని చీత్కరించబడుగాక.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

దయనీయశ్చ దయాళుః కోఽస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 33 ॥
ఓ స్వామీ! నీ కంటే దయకలవాడు మరియు నా కంటె దయనీయుడు ఈ లోకములో ఎవరున్నారు? సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 34 ॥
ఓ దేవా ! ధర్మస్థాపనలో సమర్ధుడా! ముక్కంటీ ! గురువైనవాడా! దక్షయజ్ఞనాశకుడా!సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ననుతాడితోఽసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 35 ॥
ఓ ప్రభూ ! బుధ్ధిమంతుడైన అర్జునునిచే నీవు పూర్వము ధనస్సుచే కొట్టబడితివి.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోఽసి విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 36 ॥
ఓ ప్రభూ ! బ్రహ్మదేవుడు కూడా నీ స్వరూపమిటువంటిదని వర్ణించలేడు. కనుక నీవు శ్రేష్టములైన వాటి కంటే శ్రేష్ఠుడవు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనేశ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 37 ॥
ఓ ప్రభూ! సనాతనుడైన ఈశ్వరా! ఈ లోకములో మానవునిగా జన్మించినందుకు ఫలము నీ పాద సేవయే. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

బలమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 38 ॥
ఓ ప్రభూ! బలమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నీ గుణములందు ఇష్టమును చిరకాలము అనుగ్రహించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాఙ్గ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 39 ॥
ఓ భగవంతుడా! శివుడా ! భయమును పోగొట్టువాడా! భూతపతీ! విభూతితో అలంకరించబడిన శరీరము కలవాడా ! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 40 ॥
పార్వతీ పతియైన ఓ స్వామీ ! నీ మహిమ వేదములలో ఇముడుటలేదు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

యమనియమాదిభిరఙ్గైర్యమినో హృదయే భజన్తి స త్వం భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 41 ॥
ఓ స్వామీ ! యతులు నిన్ను యమనిమాది అష్టాంగములతో తమ హృదయములో సేవించుచున్నారు.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగన్తి భాన్తి విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 42 ॥
ఓ ప్రభూ ! తాడుతో పామువలే మరియు మృత్యువు చిప్పలో వెండివలే నీలో ఈ జగత్తులో ఆ భాసించుచున్నవి. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 43 ॥
ఓ దేవా! నీ అనుగ్రహముతో చక్రాయుధమును పొంది విష్ణుమూర్తి లోకములన్నిటినీ రక్షించుచున్నాడు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

వసుధాతద్ధరచ్ఛయరథమౌర్వీశరపరాకృతాసుర భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 44 ॥
ఓ స్వామీ! భూమిని రథముగానూ, సర్పమును వింటి త్రాడుగానూ, విష్ణువును బాణముగానూ చేసుకొని త్రిపురసంహారము చేసితివి. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వత్తగర్వహరణ విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 45 ॥
ఓ సర్వరూపీ ! దేవా! సర్వోత్తమా! అన్నిటినీ ప్రసాదించువాడా! దుష్టుల గర్వమును హరించువాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

షడ్రిపుషడూర్మిషడ్వికారహర సన్ముఖ షణ్ముఖజనక విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 46 ॥
కామము- క్రోధము - లోభము- మోహము -మదము- మాత్సర్యము అను ఆరు శత్రువులను, అట్లే ఆకలి- దప్పిక- శోకము- అజ్ఞానము- ముసలితనము- మరణము అను ఆరు కష్టములను, మరియు ఉండుట- పుట్టుట- పెరుగుట- క్షీణించుట- నశించుట అను ఆరు వికారములను హరించువాడా! సుందరముఖుడా! షణ్ముఖుని జనకుడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 47 ॥
" సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" అను వాక్యముచే తెలియజేయుబడువాడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

హాహాహూహూముఖసురగాయకగీతాపదానవద్య విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 48 ॥
హాహా హూహూ మొదలైనదేవగాయకులు పొగడు కీర్తి గలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

ళాదిర్న హి ప్రయోగస్తదన్తమిహ మఙ్గలం సదాఽస్తు విభో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 49 ॥
"ళ" అను అక్షరముతో ఏ పదమూ మొదలవదు.ఆ అక్షరం చివరగా ఉన్న ’మంగళం’ ఎల్లప్పుడూ కలుగుగాక. ఓ ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకః శివ భో । 
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 50 ॥
ఓ స్వామీ! నీ పాదసేవామహోత్సవము నందు ఉత్సాహము కలవాడు దినములను క్షణమువలే గడుపును. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతః సువర్ణమాలాస్తుతిః సమ్పూర్ణః ॥

Tuesday 12 April 2016

రామాయణప్రభ : రామరక్షాస్తోత్రము (కేవల స్తోత్రము)



రామాయణప్రభ : రామరక్షాస్తోత్రము

అస్య శ్రీరామరక్షాస్తోత్రమన్త్రస్య, బుధకౌశిక ఋషిః , శ్రీ సీతారామచన్ద్రో దేవతా , అనుష్టుప్ ఛన్దః , సీతా శక్తిః , శ్రీమత్ హనుమాన్ కీలకమ్ , శ్రీరామచన్ద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ॥

॥ ధ్యానమ్ ॥

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ ।
వామాఙ్కారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలఙ్కారదీప్తం దధతమురుజటామణ్డనం రామచన్ద్రమ్ ॥

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ ॥ 1 ॥

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమణ్డితమ్ ॥ 2 ॥

సాసితూణధనుర్బాణపాణిం నక్తఞ్చరాన్తకమ్ ।
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ ॥ 3 ॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరోమే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ॥ 4 ॥

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియశ్రుతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥

జిహ్వాం విద్యానిధిః పాతు కణ్ఠం భరతవన్దితః ।
స్కన్ధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జామ్బవదాశ్రయః ॥ 7 ॥

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ ॥ 8 ॥

జానునీ సేతుకృత్పాతు జఙ్ఘే దశముఖాన్తకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః ॥ 9 ॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥

పాతాలభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥

రామేతి రామభద్రేతి రామచన్ద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విన్దతి ॥ 12 ॥

జగజ్జైత్రేకమన్త్రేణ రామనామ్నాఽభిరక్షితమ్ ।
యః కణ్ఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥

వజ్రపఞ్జరనామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమఙ్గలమ్ ॥ 14 ॥

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః ।
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ॥ 15 ॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥

తరుణౌ రూపసమ్పన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుణ్డరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినామ్బరౌ ॥ 17 ॥

ఫలమూలాశినౌ దాన్తౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షః కులనిహన్తారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥

ఆత్తసజ్జధనుషావిషుస్పృశావక్షయాశుగనిషఙ్గసఙ్గినౌ ।
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః ॥ 21 ॥

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥

వేదాన్తవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ॥ 23 ॥

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సమ్ప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥

రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువన్తి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః ॥ 25॥

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సున్దరమ్
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేన్ద్రం సత్యసన్ధం దశరథతనయం శ్యామలం శాన్తమూర్తిమ్
వన్దే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

రామాయ రామభద్రాయ రామచన్ద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

శ్రీరామ రామ రఘునన్దన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥

శ్రీరామచన్ద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచన్ద్రచరణౌ వచసా గృణామి ।
శ్రీరామచన్ద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచన్ద్రచరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥

మాతా రామో మత్పితా రామచన్ద్రః
స్వామీ రామో మత్సఖా రామచన్ద్రః ।
సర్వస్వం మే రామచన్ద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వన్దే రఘునన్దనమ్ ॥ 31 ॥

లోకాభిరామం రణరఙ్గధీరమ్
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తమ్
శ్రీరామచన్ద్రమ్ శరణం ప్రపద్యే ॥ 32 ॥

మనోజవం మారుతతుల్యవేగమ్
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానరయూథముఖ్యమ్
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥

కూజన్తం రామ రామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్య కవితాశాఖాం వన్దే వాల్మీకికోకిలమ్ ॥ 34 ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥ 35 ॥

భర్జనం భవబీజానాం అర్జనం సుఖసమ్పదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥

శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 38 ॥

॥ ఇతి శ్రీబుధకౌశికవిరచితం శ్రీరామరక్షాస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

రామాయణప్రభ : రామరక్షాస్తోత్రము (అర్థముతో)

 

 
రామాయణప్రభ : రామరక్షాస్తోత్రము

అస్య శ్రీరామరక్షాస్తోత్రమన్త్రస్య, బుధకౌశిక ఋషిః , శ్రీ సీతారామచన్ద్రో దేవతా , అనుష్టుప్ ఛన్దః , సీతా శక్తిః , శ్రీమత్ హనుమాన్ కీలకమ్ , శ్రీరామచన్ద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ॥

॥ ధ్యానమ్ ॥

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ ।
వామాఙ్కారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలఙ్కారదీప్తం దధతమురుజటామణ్డనం రామచన్ద్రమ్ ॥


ఆజానుబాహుడూ, ధనుర్బాణాలు ధరించి పద్మాసనంలో కూర్చుని ఉన్నవాడూ, పీతాంబరము ధరించినవాడూ, తాజా కమలపత్రమునుపోలు నేత్రము(లు) కలవాడూ, ప్రసన్నుడూ, ఎడమతొడపై కూర్చున్న సీతాదేవి ముఖ కమలమును వీక్షించుచున్నవాడూ, నల్లమబ్బువంటి మేనిఛాయ కలవాడూ, అనేక అలంకారములతో మెరయుచున్నవాడూ, ఊరువులవరకూ ఉన్న అల్లబడిన జట కలవాడూ అయిన రామచంద్రుని ధ్యానించుచున్నాను.

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ ॥ 1 ॥


రామభద్రుని చరితము అత్యంత విస్తారమైనది. (అందు) ప్రతీ అక్షరమూ మనుష్యుల మహాపాతకములు నాశనము చేయగలదు.

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమణ్డితమ్ ॥ 2 ॥


నల్లకలువమేనిఛాయగలవాడు, పద్మనేత్రుడూ, సీతాలక్ష్మణులతో కూడినవాడు, కిరీటమువలెనున్న అల్లిన జట కలిగినవాడు అయిన రామభద్రుని ధ్యానించి,

సాసితూణధనుర్బాణపాణిం నక్తఞ్చరాన్తకమ్ ।
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ ॥ 3 ॥


ఒరలో ఖడ్గమూ, చేతిలో ధనుర్బాణములు కలిగినవాడూ, నిశాచరులను అంతమొందించినవాడూ, జన్మలేనివాడు అయినప్పటికీ జగద్రక్షణకై ఆవిర్భవించిన పరమాత్మ (అయిన రామభద్రుని ధ్యానించి)

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరోమే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ॥ 4 ॥


(పై చెప్పబడిన విధముగా రాముని ధ్యానించి) ప్రాజ్ఞుడు , పాపములు ధ్వంసము చేయునదీ, అన్ని కోరికలు తీర్చగలిగినదీ అయిన రామరక్షా స్తోత్రము చదువవలెను. నా శిరమును రాఘవుడు రక్షించుగాక. నుదురు దశరథాత్మజుడు రక్షించుగాక.

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియశ్రుతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥


కౌసల్యాతనయుడు నా నేత్రములు రక్షించుగాక. విశ్వామిత్రునికి ప్రియుడైనవాడు నా కర్ణములను రక్షించుగాక. నా నాశికను యజ్ఞరక్షకుడు రక్షించుగాక. (లక్ష్మణుడు తన వత్సమైనవాడు) లక్ష్మణుని వాత్సల్యముగ చూచువాడు నా ముఖమును రక్షించుగాక.

జిహ్వాం విద్యానిధిః పాతు కణ్ఠం భరతవన్దితః ।
స్కన్ధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥


అన్ని విద్యలకూ ఆలవాలమైనవాడు నా నాలుకను రక్షించుగాక. భరతుడు కొలిచినవాడు నా కణ్ఠమును రక్షించుగాక. దివ్యాయుధసంపన్నుడు నా స్కందములను రక్షించుగాక. శివధనుర్భంగము చేసినవాడు నా భుజములను రక్షించుగాక.

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జామ్బవదాశ్రయః ॥ 7 ॥


సీతాపతి నా కరములను రక్షించుగాక. పరశురాముని గెలిచినవాడు నా హృదయమును రక్షించుగాక. ఖరుని దునిమినవాడు నా శరీరమధ్యభాగమును రక్షించుగాక. జాంబవంతునికి ఆశ్రయమునిచ్చినవాడు నా నాభిని రక్షించుగాక.

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ ॥ 8 ॥


సుగ్రీవునికి ప్రభువైనవాడు నా కటిని రక్షించుగాక. హనుమంతుని ప్రభువు నా తొడలను రక్షించుగాక. రఘువంశజులలో ఉత్తముడూ, రాక్షసకులాంతకుడు అయినవాడు నా పిరుదులను రక్షించుగాక.

జానునీ సేతుకృత్పాతు జఙ్ఘే దశముఖాన్తకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః ॥ 9 ॥


నా మోకాళ్ళను సేతువును నిర్మించినవాడు రక్షించుగాక. నా పిక్కలను దశముఖుని అంతమొందించినవాడు రక్షించుగాక. విభీషణునికి రాజ్యము (శ్రీ) నిచ్చినవాడు నా పాదములను రక్షించుగాక. రాముడు నా శరీరము అంతయూ రక్షించుగాక.

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥


ఈ రామబలోపేతమైన రక్షను పఠించు పుణ్యాత్మునికి (మంచిపనులుచేయువానికి) చిరాయువూ, సౌఖ్యమూ, పిల్లలూ, విజయమూ, వినయమూ కలుగుతాయి.

పాతాలభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥


రామనామములచే రక్షించబడువానిని పాతాళము లో సంచరించువారు, భూమిపై సంచరించువారు, ఆకాశములో సంచరించువారు, కామరూపములలో సంచరించువారు (కనీసం) చూడనైనా చూడలేరు.

రామేతి రామభద్రేతి రామచన్ద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విన్దతి ॥ 12 ॥


రామా (అని కాని) రామభద్రా (అని కాని) రామచంద్రా (అని కాని) స్మరించు మనుష్యుని పాపములు అంటవు. (అతనికి) భుక్తి (ఈ లోకం లో సుఖములు), ముక్తి లభిస్తాయి.

జగజ్జైత్రేకమన్త్రేణ రామనామ్నాఽభిరక్షితమ్ ।
యః కణ్ఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥


ఈ రామనామములచే రక్షించబడు మంత్రము జగత్తునందు శ్రేష్ఠము. ఎవరైతే ఈ స్త్రోత్రమును కంఠమున ధరిస్తారో (పఠిస్తారో, కంఠస్తం చేస్తారో) వారికి అన్ని సిద్ధులూ కరతలామలకములు అవుతాయి.

వజ్రపఞ్జరనామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమఙ్గలమ్ ॥ 14 ॥


వజ్రపంజరమనే పేరున్న ఈ రామకవచమును స్మరించే వారి ఆజ్ఞ (మాట) ఎదురులేనిది అవుతుంది. వారికి సర్వత్ర విజయము, శుభము కలుగుతాయి.

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః ।
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ॥ 15 ॥


స్వప్నములో శివుడు ఆదేశించిన విధముగా ఈ రామరక్షా స్తోత్రమును బుధకౌశికుడు నిదురలేచి ప్రాతఃకాలమున గ్రంధస్థం చేసెను.

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥


కల్పవృక్షాలకు ఆలవాలమైనవాడు (అన్ని కోరికలూ తీర్చువాడు), సకల ఆపదలూ నివారించువాడు, ముల్లోకాలనూ రంజింపచేయువాడు, సీత (లక్ష్మి) తో కూడినవాడు అగు రాముడు మనకు ప్రభువు.

తరుణౌ రూపసమ్పన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుణ్డరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినామ్బరౌ ॥ 17 ॥


(రామలక్ష్మణులు ఇరువురూ) యవ్వనులూ, సౌందర్యవంతులూ, సుకుమారులూ, గొప్ప బలశాలులూ, పద్మములవంటి విశాలమైన నేత్రములున్నవారూ, నారచీరలూ, కృష్ణాజినమూ ధరించినవారూ (తరువాతి శ్లోకము తో అనుసంధానము)

ఫలమూలాశినౌ దాన్తౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

కందమూలములూ, ఫలములూ తినువారు, ఆత్మనిగ్రహము కలవారు, తాపసులు, బ్రహ్మచారులు, అన్నదమ్ములు అయిన దశరథుని కుమారులు రామలక్ష్మణులు (తరువాతి శ్లోకము తో అనుసంధానము)

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షః కులనిహన్తారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥


బలశాలులెల్లరిలోనూ శరణుకోరదగినవారూ, ధానుష్కులలోకెల్ల శ్రేష్ఠులూ, రాక్షసకులమర్దనులూ, రఘువంశములో ఉత్తములూ (అగు రామలక్ష్మణులు) మనను రక్షించుగాక.

ఆత్తసజ్జధనుషావిషుస్పృశావక్షయాశుగనిషఙ్గసఙ్గినౌ ।
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥


అక్షయ బాణ తూణీరములతో, సిద్ధముగా నున్న ధనుస్సులతో, బాణములను తాకుతున్న చేతులతో (ప్రయోగమునకు సిద్ధముగా అని) ఉన్న రామలక్ష్మణులు నన్ను కాపాడుటకై దారిలో నా ముందు నడిచెదరుగాక.

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః ॥ 21 ॥


కవచముతో, ఖడ్గముతో, ధనుర్బాణములతో సన్నద్ధముగా నున్న యవ్వనములోనున్న రాముడు లక్ష్మణుడితో కలిసి మనను రక్షించుగాక. ఇదే నా మనోరథము.

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥


రాముడు దశరధ, కౌసల్యల తనయుడు, శూరుడు, లక్ష్మణుడు ఎప్పుడూ వెంట ఉండేవాడు, బలవంతుడు, కాకుత్స్థ వంశములో జన్మించినవాడు, సంపూర్ణ పురుషుడు, రఘువంశములో ఉత్తముడు.

వేదాన్తవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ॥ 23 ॥


(రాముడు) వేదాంతముద్వారా తెలుసుకోదగినవాడు, యజ్ఞములకు పతి, ప్రాచీనుడు, పురుషోత్తముడు, జానకీనాథుడు, సంపద (లక్ష్మి) కలిగినవాడు, అనంత (కొలువలేని) పరాక్రమము కలిగినవాడు.

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సమ్ప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥


(శివుడు అంటున్నాడు) నా భక్తుడు శ్రద్ధతో ఈ విధముగా నిత్యమూ జపిస్తే నిస్సందేహముగా అశ్వమేధయజ్ఞము కన్నాఅధికముగా పుణ్యము లభిస్తుంది.

రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువన్తి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః ॥ 25॥

దూర్వాదళములవంటి నల్లని దేహచ్ఛాయ కలవాడు, పద్మనేత్రుడూ, పీతాంబరములు ధరించినవాడు అగు రాముని (ఈ స్తోత్రమునందలి) దివ్యనామములతో స్తుతించిన వానికి సాధారణ సంసారబంధములు ఉండవు.

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సున్దరమ్
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేన్ద్రం సత్యసన్ధం దశరథతనయం శ్యామలం శాన్తమూర్తిమ్ 

వన్దే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

లక్ష్మణుని అన్నగారు, రఘువంశ శ్రేష్ఠుడూ, సీతాపతి, సుందరుడూ, కాకుత్స్థ వంశములో జన్మించినవాడూ, దయాసముద్రుడూ, సద్గుణములకు ఆలవాలమైనవాడూ, బ్రాహ్మణులకు ఇష్టుడూ, ధార్మికుడూ, రాజులకు రాజు (చక్రవర్తి), సత్యమునతిక్రమించనివాడూ, దశరథుని కుమారుడూ, నల్లని మేనిచ్ఛాయకలవాడూ, శాంత స్వభావుడూ, లోకమును రంజింపచేయువాడూ, రఘువంశ సంజాతుడూ, ఆ రఘువంశములో ఎన్నదగినవాడు, రావణాసురుని సంహరించినవాడూ అగు రామునికి నమస్కరించుచున్నాను.

రామాయ రామభద్రాయ రామచన్ద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

రామునికి, రామభద్రునికి, రామచంద్రునికి, పరబ్రహ్మమునకు, రఘువంశజుల ప్రభువుకు, (అందరి) నాథునికి, సీతాపతికి నమస్కారములు.

శ్రీరామ రామ రఘునన్దన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥


రఘువంశజులకు ఆనందముకలిగించువాడూ, భరతునికి అన్నగారు, యుద్ధములో కర్కశుడూ అగు శ్రీరాముడు నాకు శరణం.

శ్రీరామచన్ద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచన్ద్రచరణౌ వచసా గృణామి ।
శ్రీరామచన్ద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచన్ద్రచరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥


శ్రీరామచంద్రుని చరణములను మనసా స్మరించుచున్నాను. వాక్కుచే స్తుతించుచున్నాను, శిరస్సుతో నమస్కరించుచున్నాను. శరణువేడుతున్నాను.

మాతా రామో మత్పితా రామచన్ద్రః
స్వామీ రామో మత్సఖా రామచన్ద్రః ।
సర్వస్వం మే రామచన్ద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥


నాకు తల్లీ, తండ్రీ, ప్రభువూ, స్నేహితుడూ, సర్వస్వమూ దయాళువైన రామచంద్రుడే. నాకు వేరు తెలియదు కాక తెలియదు.

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వన్దే రఘునన్దనమ్ ॥ 31 ॥


కుడివైపున లక్ష్మణుడూ, ఎడమవైపున జానకీదేవీ, ముందున హనుమంతుడూ ఉన్న రఘునందనునికి (రఘువంశజులకు ఆనందముకలిగించువానికి) నేను నమస్కరించుచున్నాను.

లోకాభిరామం రణరఙ్గధీరమ్
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తమ్
శ్రీరామచన్ద్రమ్ శరణం ప్రపద్యే ॥ 32 ॥

లోకమును రంజింపచేయువాడూ, యుద్ధభూమిలో ధీరుడూ, పద్మ నేత్రుడూ, రఘువంశజుల ప్రభువూ, మూర్తీభవించిన కారుణ్యమూ, కరుణాకరుడూ అయిన శ్రీరామచంద్రుని శరణువేడుతున్నాను.

మనోజవం మారుతతుల్యవేగమ్
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానరయూథముఖ్యమ్
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥


మనోవేగము కలవాడూ, వాయు సమవేగము కలవాడూ, ఇంద్రియములను జయించినవాడూ, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడూ, వానరసైన్యములో ముఖ్యుడూ శ్రీరామునిదూత అగు హనుమంతుని శరణువేడుతున్నాను.

కూజన్తం రామ రామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్య కవితాశాఖాం వన్దే వాల్మీకికోకిలమ్ ॥ 34 ॥


కవితాకొమ్మలనెక్కి రామా, రామా అను మధురాక్షరాలను తీయగా కూయుచున్న వాల్మీకి కోకిలకు నమస్కరిస్తున్నాను.

ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥ 35 ॥


ఆపదలను తొలగించువాడూ, సర్వసంపదలనూ ప్రసాదించువాడూ, లోకమును రంజింపచేయువాడూ అగు శ్రీరామునికి మరల మరల నమస్కరించుచున్నాను.

భర్జనం భవబీజానాం అర్జనం సుఖసమ్పదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥


రామ రామ అను గర్జన (రామనామ జపం) సంసారమూలములను (మరల జన్మించు కారణములను) నశింపజేయునది (ముక్తిని ప్రసాదించునది), సుఖసంపదలను ఆర్జించిపెట్టునది, యమదూతలను బెదిరించునది.

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥


రాజశ్రేష్ఠుడైన రామునికి సదా జయమగుగాక. లక్ష్మీపతి అగు రాముని భజించుచున్నాను. ఏ రామునిచేత రాక్షససేనలు నశింపచేయబడినవో ఆట్టి రామునికి నమస్కారములు. రాముని కన్నా గొప్ప గమ్యము వేరొకటిలేదు. నేను రామునియొక్క దాసుడిని. నా మనస్సు ఎల్లప్పుడూ రామునియందు లయమగుగాక. ఓ రామా!నన్ను ఉద్ధరించు.

శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 38 ॥


(శివుడు పార్వతి తో అంటున్నాడు) ఓ అందమైనదానా! శ్రీరామ రామ రామ అని నేను (మనస్సులో) రమిస్తున్నాను. ఓ సుందరమైన ముఖముకలదానా! రామనామము సహస్రనామములతో తుల్యము.

॥ ఇతి శ్రీబుధకౌశికవిరచితం శ్రీరామరక్షాస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Monday 4 April 2016

రామాయణ ప్రభ : త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు



రామాయణ ప్రభ : త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు
(శ్రీరామ కర్ణామృతమునుండి)

ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం
బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్,
దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్.


దేవతల కధిపతియైనవాడు , సూర్యవంశశ్రేష్ఠుడు , ఎల్లలోకాలనూ ఆనందింపజేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు గలిగినవాడు, శివాదులచే స్తోత్రము చేయబడువాడు, హృదయమందు ధ్యానింపదగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములచే ప్రకాశించువాడు , కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు , చిఱునవ్వుమోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానము చేయుచున్నాను.

మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం
మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్,
సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం
వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్.


మాణిక్యసమూహముచే సుందరుడు, చూపులతో చిరునవ్వులు చిందించువాడు, బహుసూర్యుల కాంతిగలిగిన వాడు, మరకత మణుల ప్రోగువంటి ఆకారము గలిగినవాడు, ఆనందస్వరూపుడు, ఎడమతొడపై సీత ఉన్నవాడు, పద్మములవంటి నేత్రములు కలిగినవాడు , పచ్చని వస్త్రమును ధరించినవాడు, అన్ని లోకములకు నివాసస్థానమైనవాడు, శ్రేష్ఠములైన ధనుర్బాణములు ధరించినవాడు, నా మనమున బ్రకాశించుచున్నవాడు అగు రామచంద్రుని మధ్యాహ్నమున నమస్కరించుచున్నాను.

ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారం
శ్యామం శాంతం సురేంద్రం సురమునివినతం కోటిసూర్యప్రకాశమ్,
సీతసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.


చంద్రుని వలె నుండువాడు, నమస్కరించువారికి సంసారారణ్యబాధ నంతయు హరించువాడు , నల్లనివాడు , శాంతుడు, దేవతలచే మునులచే నమస్కరింపబడువాడు, కోటి సూర్యుల కాంతి వంటి కాంతిగలిగినవాడు , సీతాలక్ష్మణులచే సేవింపబడుతున్నవాడు, దేవతలకు మనుష్యులకు సులభుడైనవాడు , గొప్పసింహాసనమందున్నవాడు , నవ్వుచే సుందరమైన మోముగల రామమూర్తి నెల్లపుడు సాయంకాలంమందు ధ్యానించుచున్నాను.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.