బ్రోవ భారమా రఘురామ
బహుదారి – ఆది
పల్లవి:
బ్రోవ భారమా రఘురామ
భువనమెల్ల నీవై నన్నొకని ॥బ్రో॥
అను పల్లవి:
శ్రీవాసుదేవ అండకోట్ల కు
క్షిని ఉంచు కోలేదా నన్ను ॥బ్రో॥
చరణము(లు):
కలశాంబుధిలో దయతో నమరులకై యదిగాక
గోపికలకై కొండలెత్తలేదా కరుణాకర త్యాగరాజుని ॥బ్రో॥