కఞ్జదళాయతాక్షీ
మనోహరి / ఆదిపల్లవి:
కఞ్జదళాయతాక్షి కామాక్షి కమలామనోహరి త్రిపురసున్దరి
మధ్యమకాలసాహిత్యం:
కుఞ్జరగమనే మణిమణ్డిత మఞ్జుళచరణే
మామవశివ పఞ్జరశుకి పఙ్కజముఖి
గురుగుహ రఞ్జని దురితభఞ్జని నిరఞ్జని
చరణము:
రాకా శశివదనే సురదనే రక్షితమదనే రత్నసదనే
శ్రీకాఞ్చినివసనే సురసనే శృఙ్గారాశ్రయ మన్దహసనే
మధ్యమకాలసాహిత్యం:
ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానన్దామృతఝరి భాస్వరి
ఏకాగ్రమనోలయకరి శ్రీకరి ఏకామ్రేశ గృహేశ్వరి శఙ్కరి