శ్రీరంజని
- ఆది (దివ్యనామము)
పల్లవి:
బ్రోచే
వారెవరే రఘుపతే ॥బ్రో॥
నిను
వినా ॥బ్రో॥
శ్రీరామా
నెనరునఁ ॥బ్రో॥
సకల
లోకనాయక ॥బ్రో॥
నరవర
నీ సరి ॥బ్రో॥
దేవేంద్రాదులు
మెచ్చుటకు లంక
దయతో
దానమొసంగి సదా ॥బ్రో॥
మునిసవంబుఁ
జూడ వెంటఁ జని ఖల
మారీచాదుల
హతంబుజేసి ॥బ్రో॥
వాలి
నొక్కకోలనేసి రవి బా
లుని
రాజుఁగ గావించి జూచి ॥బ్రో॥
భవాబ్ధి
తరణోపాయము నేరని
త్యాగరాజుని
కరంబిడి ॥బ్రో॥