శివస్తుతులు : పంచాక్షరీ ఉపదేశం తరువాత బ్రహ్మాచ్యుతుల శివ స్తుతి
(శివపురాణం)
నమో నిష్కలరూపాయ నమో నిష్కల తేజసే | నమస్సకల నాథాయ నమస్తే సకలాత్మనే ||
నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే | నమస్సృష్ట్యాది కర్త్రే చ నమః పంచముఖాయ తే ||
పంచ బ్రహ్మ స్వరూపాయ పంచకృత్యాయ తే నమః | ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే ||
సకలా కల రూపాయ శంభవే గురవే నమః | ఇతి స్తుత్వా గురుం పద్యైర్బ్రహ్మ విష్ణుశ్చ నేమతుః ||
నిరాకారుడవగు నీకు నమస్కారము. తేజోరూపుడవగు నీకు నమస్కారము. సాకారుడవగు ఈశునకు నమస్కారము .
ఓంకార వాచ్యుడవగు నీకు నమస్కారము. ఓంకారము నీ చిహ్నము. సృష్ట్యాది పంచకృత్యములను చేయు, ఐదు ముఖములు గల నీకు నమస్కారము.
సృష్ట్యాది ఐదు కృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. ఆత్మరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, అనంత గుణములు, శక్తి గలవాడు నగు నీకు నమస్కారము.
సాకార, నిరాకార రూపుడగు శివగురువునకు నమస్కారము. బ్రహ్మ విష్ణువులు ఇట్లు గురువును శ్లోకములతో స్తుతించి నమస్కరించిరి.