1 ప్రశ్న: ఏయే రోజు , ఏయే దేవతారాధనకు అనుకూలమైనదో తెలియజేయగోరతాను?
జవాబు: ఆదివారం - సూర్యునికి
సోమవారం - శివునికి
మంగళవారం - సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి
బుధవారం - విష్ణువునకు
గురువారం - నవగ్రహములకు
శుక్రవారం - అమ్మవారికి
శనివారం - శ్రీ మహా విష్ణువుకు.
2 ప్రశ్న: ఇంట్లో ఉండదగిన , ఇంటిని సుసంపన్నం చేయగలిగిన వస్తువులు ఏవి?
జవాబు: 1 - కుడివైపు తిరిగి ఉన్న శంఖము
2- ఆవు
3 - ఏక ముఖ రుద్రాక్ష
4 - తులసి కోట
3 ప్రశ్న: అవసర కార్యం మీదో లేదా ఇతర పనుల మీదో బయటికి వెళుతున్నప్పుడు మేము పఠించవలసిన శ్లోకము ఏమిటి?
జవాబు: విష్ణుసహస్రనామంలో వస్తుంది.
" వనమాలీ గదీ శార్జ్గీశంఖీచక్రీ చ నందకీ|
శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు||"
4 ప్రశ్న: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరి ముఖము చూస్తే మంచిది?
జవాబు: ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దము , ఆవు , తల్లిదండ్రుల ముఖం చూస్తే మంచిది. వివాహమైన పురుషులు భార్య ముఖం చూడవచ్చు.
5 ప్రశ్న: ఇక్కడ కొందరు జ్యోతిష్కులు " యమగండం" మంచి సమయమే అని , ఆ సమయంలో శుభకార్యాలు చేయవచ్చునని చెపుతున్నారు సరియేనా?
జవాబు: రాహుకాలం , యమగండం - ఈ సమయాలలో శుభకార్యాలు చేయకూడదు , ఆరంభించనూ కూడదు.