కాంభోజి
– దేశాది
పల్లవి:
మాజానకి
చెట్ట బట్టఁగ మహరాజవైతివి ॥మా॥
అను
పల్లవి:
రాజరాజ
వర! రాజీవాక్ష! విను
రావణారి
యని రాజిల్లు కీర్తియు ॥మా॥
చరణము(లు):
కానకేగి
యాజ్ఞమీఱక మాయా
కార
మునిచి శిఖిచెంతనేయుండి
దానవునివెంటనె
చని యశోకతరుమూలనుండి
వానిమాటలకు
కోపగించి కంట
వధియించకనే
యుండి
శ్రీనాయక
యశము నీకే కల్గఁ
జేయలేదా
త్యాగరాజ పరిపాల ॥మా॥