॥ శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రమ్ ॥
ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకం
కలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥
సంతోషముతో ఉండ్రాళ్ళు పట్టుకున్నవాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, అనాథలకు దిక్కైనవాడు, చంద్రుని తలపై అలంకరించుకున్నవాడు, విలసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుని సంహరించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను.
నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ ।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ॥ 2॥
నమస్కరించని వారికి అతి భయంకరుడు, ఉదయించిన సూర్యునివలే ప్రకాశించువాడు, రాక్షసులను,దేవతలను తన అధీనములో ఉంచుకొన్నవాడు, నమస్కరించువారిని ఆపదలనుండి ఉద్ధరించువాడు, దేవతలకు రాజు, నిధులకధిపతి, గజేశ్వరుడు, ప్రమథగణములకు నాయకుడు, ఐశ్వర్యసంపన్నుడు, పరాత్పరుడు అగు వినాయకుని ఎల్లప్పుడూ ఆశ్రయించుచున్నాను.
సమస్తలోకశఙ్కరం నిరస్తదైత్యకుఞ్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3॥
సమస్తలోకములకు మేలు చేయువాడు, మదించిన ఏనుగుల వంటి రాక్షసులను సంహరించినవాడు, పెద్దబొజ్జ కలవాడు, శ్రేష్ఠుడు, గజముఖుడు, నాశములేనివాడు, దయతలచువాడు, సహనవంతుడు, సంతోషమునకు స్థానమైనవాడు, కీర్తి కలిగించువాడు, నమస్కరించువారికి మంచి మనస్సునిచ్చువాడు, ప్రకాశించువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను.
అకిఞ్చనార్తిమార్జనం చిరన్తనోక్తిభాజనం
పురారిపూర్వనన్దనం సురారిగర్వచర్వణమ్ ।
ప్రపఞ్చనాశభీషణం ధనఞ్జయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ॥ 4॥
దరిద్రుల బాధలను తొలగించువాడు, వేదవాక్కులకు నిలయమైనవాడు, శివుని పెద్ద కుమారుడు, రాక్షసుల గర్వమును అణగదొక్కువాడు, ప్రళయకాలభయంకరుడు, అగ్ని మొదలగు దేవతలకు అలంకారమైనవాడు, చెంపలపై మదజలము కారుచున్నవాడు అగు గజాననుని సేవించుచున్నాను.
నితాన్తకాన్తదన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయకృన్తనమ్ ।
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేవ తం విచిన్తయామి సన్తతమ్ ॥ 5॥
తళతళలాడు దంతమున్నవాడు, యమునిని కూడ అంతమొందించు శివునకు పుత్రుడు, ఊహకందని రూపము కలవాడు, అంతము లేనివాడు, విఘ్నములను భేదించువాడు అగు ఏకదంతుని ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను.
మహాగణేశ్పఞ్చరత్నమాదరేణ యోఽన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ ।
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్ ॥ 6॥
ప్రతిదినమూ ప్రాతఃకాలమునందు గణేశ్వరుని హృదయములో స్మరించుచూ ఎవడు భక్తితో ఈ గణేశ పంచరత్నస్తోత్రమును పఠించునో అతడు ఆరోగ్యమును, నిర్దోషత్వమును, మంచి విద్యనూ, చక్కని సంతానమునూ పొంది చిరాయువై శీఘ్రముగనే అష్టైశ్వర్యములను పొందును.
॥ ఇతి శ్రీశఙ్కరభగవత్పాదాచార్య కృతం శ్రీగణేశపఞ్చరత్నస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
No comments:
Post a Comment