రథసప్తమీ
ఈ పుణ్యదినమున అరుణోదయమందు స్నానము చేయవలెను. ఈ క్రింది మంత్రముతో స్నానమాచరించవలెను. తలపై జిల్లేడు ఆకులుగాని, రేగు ఆకులు కాని, చిక్కుడుఆకులుకాని పెట్టుకుని స్నానమాచరించడం సంప్రదాయం.
యదా జన్మకృతం పాపం మయా జన్మజన్మసు
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ||
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ||
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ||
(క్లుప్తంగా అర్థం : అనేక జన్మలలో చేసిన పాపము, శోక, రోగ రూపములైన పాపము, తెలిసి తెలియక చేసినది, ఈ సప్తమి నాటి స్నానము హరింపునని)
ఈ శ్లోకముతో అర్ఘ్యమునీయవలెను.
సప్తసప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||
ఆవుపేడ పిడకలు కాల్చి క్షీరాన్నమువండి సూర్యునికి నివేదన చేయాలి. జిల్లేడు పూవులతో సూర్యుని పూజించాలి.
రథసప్తమినాడు ఆదిత్యహృదయం పారాయణ విశేషఫలములొసగుతుంది. ఆకసంలో సూర్యరూపుడైన ఈశ్వరునికై రుద్రపారాయణము చేయవచ్చునని కొందరి అభిప్రాయం.
రథసప్తమినాడు నూతన వ్రతములు సంకల్పించుటకు మంచిరోజు.
No comments:
Post a Comment