॥ श्री शंकराचार्य कृतं जगन्नाथाष्टकम् ॥
॥ శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకమ్ ॥
కదాచిత్కాలిన్దీ తటవిపిన సఙ్గీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశమ్భుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 1 ॥
ఒకొక్కప్పుడు కాళిందీనది ఒడ్డునందలి వనములలో వేణుగానం చేయుచూ సంతోషముతో గోపికల ముఖ పద్మములలోని మధురిమను ఆస్వాదించువాడు, లక్ష్మి - ఈశ్వరుడు - బ్రహ్మ - దేవేంద్రుడు - వినాయకుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు అగు జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిఞ్ఛం కటితటే
దుకూలం నేత్రాన్తే సహచరకటాక్షం విదధత్ ।
సదా శ్రీమద్బృన్దావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 2 ॥
ఎడమచేతిలో వేణువును , తలపై నెమలిపింఛమును , నడుము నందు పట్టువస్త్రమును , కళ్ళచివర మిత్రులపై కటాక్షమును కలిగి ఉండి ఎల్లప్పుడు అందమైన బృందావనమునందు ఆటలాడు జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.
మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాన్తస్సహజబలభద్రేణ బలినా ।
సుభద్రామధ్యస్థస్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 3 ॥
సముద్రతీరంలో , బంగారు కాంతి - నల్లని శిఖరం కల భవనంలో , సోదరులైన సుభద్రా బలరాముల మధ్య కూర్చుని దేవతలందరిచే పూజింపబడు జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
కృపాపారావారాస్సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమస్సురదమలపద్మోద్భవముఖైః ।
సురేన్ద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 4 ॥
దయాసముద్రుడు , కారుమబ్బుల వరసవలే సుందరుడు , లక్ష్మి - సరస్వతి - సూర్యుడు - అగ్ని - బ్రహ్మదేవుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు , ఉపనిషత్తులచే కొనియాడబడువాడు అగు జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.
రథారూఢో గచ్ఛన్ పథి మిలితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః ।
దయాసిన్ధుర్బన్ధుస్సకలజగతాం సిన్ధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 5 ॥
రథమెక్కి ఊరేగుచూ దారిలో కలసిన బ్రాహ్మణులు చేయు స్తోత్రములలోని ప్రతిపదమును విని దయచూపించు కరుణాసముద్రుడు , సకల జగద్బాంధవుడు అగు జగన్నాథస్వామి లక్ష్మితో కలిసి నాకళ్ళకు కనబడుగాక.
పరబ్రహ్మాపీడః కువలయదలోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనన్తశిరసి ।
రసానన్దో రాధాసరసవపురాలిఙ్గనసఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 6 ॥
పరబ్రహ్మ స్వరూపుడు , కలువరేకులవలే వికసించిన నేత్రములు కలవాడు , నీలాద్రిపై నివసించువాడు , అనంతుడనే సర్పరాజు శిరస్సుపై కాలుపెట్టినవాడు , ఆనందమయుడు , రాధను కౌగిలించుకొని సుఖించువాడు అగు జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ ।
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 7 ॥
నాకు రాజ్యము - బంగారము - భోగము - ఐశ్వర్యము వద్దు. జనులందరూ ఇష్టపడే అందమైన స్త్రీని నేను కోరను. ఎల్లప్పుడు పరమేశ్వరునిచే స్తుతించబడు జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే ।
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 8 ॥
ఓ దేవరాజా! నీవు నిస్సారమైన సంసారమును తొందరగా హరించుము. ఓ యాదవపతీ! నా పాపములరాశిని పోగొట్టుము. దీనుడను , అనాథుడను , బండవలే నిశ్చలంగా పడి ఉన్న నన్ను రక్షించుటకై జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకం సమ్పూర్ణమ్ ॥
No comments:
Post a Comment