Wednesday, 3 February 2016

శంకరస్తోత్రాలు : షట్పదీస్తోత్రమ్



॥ श्री शंकराचार्य कृतं षट्पदी स्तोत्रम् ॥

|| శ్రీ శంకరాచార్య కృతం షట్పదీ స్తోత్రమ్ ||

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ ।
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ॥ 1 ॥

ఓ నారాయణా నా అవినయమును పోగొట్టుము. మనోనిగ్రహమును కలిగించుము.సుఖములపై భ్రాంతిని శాంతింపచేయుము.భూతదయను విస్తరింపచేయుము.సంసార సముద్రము నుండి తరింపచేయుము.


దివ్యధునీమకరన్దే పరిమలపరిభోగసచ్చిదానన్దే ।
శ్రీపతిపదారవిన్దే భవభయఖేదచ్ఛిదే వన్దే ॥ 2 ॥

ఆకాశగంగయే మకరందముగా కలవీ, సచ్చిదానందములే పరిమళముగా కలవీ, సంసారభయమనే దుఃఖమును నశింపచేయునవీ అగు నారాయణుని పాదపద్మములను నమస్కరించుచున్నాను.


సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వమ్ ।
సాముద్రో హి తరఙ్గః క్వచన సముద్రో న తారఙ్గః ॥ 3 ॥

ఓ ప్రభూ! నీకూ నాకూ బేధము లేకపోయినా నేను, నీకు చెందినవాడనే కానీ నీవు నాకు చెందినవాడవు కాదు. తరంగము సముద్రమునకు చెందును కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా!

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే ।
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ॥ 4 ॥

గోవర్ధనగిరినెత్తినవాడా! పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా! రాక్షసకులమునకు శత్రువైనవాడా! సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! నీవు ప్రత్యక్షమైనచో సంసారము నశించక ఎట్లుండును!

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధామ్ ।
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహమ్ ॥ 5 ॥

ఓ పరమేశ్వరా! మత్స్యము మొదలైన అవతారములనెత్తి ఎల్లప్పుడూ భూమిని కాపాడు నీవు సంసారతాపముతో భయపడు నన్ను రక్షించుము.

దామోదర గుణమన్దిర సున్దరవదనారవిన్ద గోవిన్ద ।
భవజలధిమథనమన్దర పరమం దరమపనయ త్వం మే ॥ 6 ॥

వనమాలధరించినవాడా! గుణములకు నిలయమైనవాడా! సుందరమైన వదనారవిందము కలవాడా! సంసారమనే సముద్రమును మథించు మందరపర్వతము వంటివాడా! గోవిందుడా!  నీవు నా మహాభయమును పోగొట్టుము.

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ।
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ॥ 7 ॥

నారాయణుడా! కరుణామయుడా! నీ పాదపద్మములను శరణు పొందుచున్నాను. ఆరు శ్లోకములతో కూర్చిన ఈ స్తోత్రమనే తుమ్మెద నా ముఖమనే పద్మమునందు ఎల్లప్పుడూ ఉండుగాక.

|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం షట్పదీస్తోత్రం సమ్పూర్ణమ్ ||

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.