శ్రీశ్రీశ్రీచంద్రశేఖరేంద్రసరస్వతి స్తుతి
(హరిసాంబశివశాస్త్రి)
(హరిసాంబశివశాస్త్రి)
శ్రీ శంకరార్య పద మాస్థిత మిద్ధదీప్తిం
శ్రీ కామకోటి పద దేశిక మాప్త బంధుమ్|
శ్రీ చంద్రశేఖర ముదారగుణం వరేణ్యం
కాంచీయతీంద్ర గురురాజ మహం ప్రపద్యే||
శ్రీ చంద్రశేఖర పదాబ్జవిలీనభృంగం
శ్రీ దేవతాపదసరో రుహ సౌరభాఢ్యమ్|
శ్రీ వేదవాఙ్మయసముద్ధరణైకదీక్షం
కాంచీయతీంద్ర మనిశం మనసాస్మరామి||
ధర్మోత్తరే పథిచరన్త మనల్ప సత్త్వం
భక్తాంశ్చ ధర్మమహితే పథి చారయన్తమ్|
బోధామృత ప్రశమితాఖిల తాపబృందం
కాంచీయతీంద్ర మిహనౌమి జగద్గురుం తమ్||