Sunday 22 May 2016

సంగ్రహ ధర్మ విషయములు - నిద్రలేవటం


సంగ్రహ ధర్మ విషయములు

      నిద్రలేవటం

బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితమ్|
స్మరణం వాసుదేవస్య కుర్యాత్ కలిమలాపహమ్||

సూర్యుడు ఉదయించడానికి 2 ముహూర్తాలు అంటే సుమారుగా తెల్లవారుజామున 4:30 నుండి 5:00 గంటల నడుమ నిద్ర లేవాలి . నిద్ర లేచిన తర్వాత వాసుదేవుని అంటే తనకు ఇష్టం అయిన దేవుడిని తలచుకోవాలి.

హరే రామ హరే రామ రామ రామ హరే హరే|
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే||


విశ్వేశం కేశవం ధుంఢిం దండపాణిం చ భైరవమ్|
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్||

ఇలా ఇష్టమైన దైవానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి . దైవస్మరణం తరువాత మెల్లగా కళ్ళు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్||

అరచేయి కిందివైపు చివర లక్ష్మిని , మధ్యలో సరస్వతిని , మొదట్లో గౌరిని స్మరించాలి . తరువాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు.

ఆ తరువాత-
  సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||

అంటూ భూమిని ప్రార్థిస్తూ , నమస్కరించి తరువాత కాలు నేలపై మోపాలి.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.