Thursday, 1 September 2016

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : ప్రవర్తన


 
రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  ప్రవర్తన
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)

(అయోధ్యాకాండ తొలి సర్గ)

తల్లి తండ్రుల వంశము ప్రశంసింపదగినది. అట్టి ఉత్తమ వంశమున పుట్టిననూ మంచితనము చెదరక దానిచే గర్వింపక ప్రవర్తించెడివాడు. ఎంతటి కష్టములు వచ్చిననూ , మనస్సును కలత పరిచెడి సన్నివేశములు ఏర్పడిననూ దిగులు పడని , దైన్యము నొందని మనస్సు కలవాడు. సత్యమును పాటించుటలో తీవ్రమగు పట్టుదల కలవాడు. మనోవాక్కాయములలో ఏకరూపత కలవాడు. ఎవరితో తాను కలసి ఉన్నప్పుడు అచ్చముగ వారివలెనే ఉండెడివాడు కాని , తాను గొప్పవాడననునట్లు ఉండెడివాడుకాదు. క్రమశిక్షణ కలిగిన మనః ప్రవృత్తి కలవాడు. పెద్దల వద్ద బాగుగ శిక్షితమైన మనసు , మాట గలవాడు. ధర్మ ,అర్థ ,ఆచరణమున ఎట్లు ప్రవర్తింపవలెనో ఎరింగిన పెద్దలు చెప్పినట్లు నడుచుకొనెడివాడు. ధర్మమును ఆర్జించుటలో ఎట్లు ఉండవలెనో చక్కగా ఎరింగినవాడు. కామమును అనుభవించుటలో , అర్థమును ఆర్జించుటలో ఎట్లు ఉండవలెనో ఎరింగినవాడు. రోజులో పూర్వాహ్ణమున ధర్మాచరణము , మథ్యాహ్నమున అర్థసంపాదన , అపరాహ్ణమున కామ విషయకమైన ప్రవృత్తి ఉండవలెనని స్మృతులలో చెప్పినట్లుగ ప్రవర్తించెడివాడు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.